Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ వారం ఓటీటీలో పండగే పండగ. తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఈ వారం ఓటీటీలో పండగే పండగ. తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

Big TV Live 3 days ago

OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ వారం ఇంట్లోనే ఉండి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే తెలుగు మూవీ లవర్స్ కోసం ఏకంగా ఆరు సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేస్తున్నాయి.

కామెడీ నుంచి హారర్ వరకు, క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు డిఫరెంట్ జానర్లలో కంటెంట్ అందుబాటులోకి రాబోతుండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ కంటెంట్ వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఈ వారం రాబోతున్న కంటెంట్ లిస్ట్

1. Vadhala (తెలుగు) – ETvWin - సెప్టెంబర్ 3
2. Korean Kanakaraju (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – Netflix - సెప్టెంబర్ 4
3. DC (తమిళం, తెలుగు, మలయాళం) – Sun NXT - సెప్టెంబర్ 4
4. Jagamae Sangeetham Series (తెలుగు, తమిళం) – Prime Video - సెప్టెంబర్ 4
5. Veerabhadruni Rahasyam Season 1 Part 2 (తెలుగు) – Zee5
6. Unmadham (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – SonyLIV

వదల మూవీ

పక్కా హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. భయపెట్టే సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది.

కొరియన్ కనకరాజు

పూర్తిస్థాయి కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ.

డీసీ

యాక్షన్, డ్రామా అంశాలతో మాస్ అండ్ యాక్షన్ లవర్స్‌ను అలరించడానికి వస్తోంది.

సస్పెన్స్ ఫుల్ సిరీస్‌లు

మ్యూజికల్ డ్రామాగా వస్తున్న ‘జగమే సంగీతం’, ఇప్పటికే మొదటి భాగంతో క్యూరియాసిటీ పెంచిన ‘వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2’, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఉన్మాదం’ కూడా తెలుగులో అందుబాటులో ఉండనున్నాయి.

ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసే ఛాన్స్

ఈ వారం వస్తున్న కంటెంట్ ప్రత్యేకం ఏంటంటే… ఇవి కేవలం ఒక్కరి కోసమే కాకుండా, కుటుంబమంతా కలిసి చూడగలిగేలా అన్నీ వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. వీకెండ్‌ లో బయటకు వెళ్లే పని లేకుండా, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పాప్‌కార్న్ తింటూ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వర్క్ ప్రెజర్ నుంచి ఉపశమనం పొందేందుకు వీటిలోని కామెడీ, మ్యూజికల్ ఎలిమెంట్స్ ఎంతగానో తోడ్పడతాయి.

వీకెండ్ ప్లాన్ అదుర్స్

ఈ వారం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, తమ అభిరుచికి తగ్గట్టుగా నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే అవకాశం మూవీ లవర్స్‌కు దక్కుతోంది. థియేటర్‌లో చూసే టైమ్ లేకపోయినా, వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి వీక్షించడానికి ఈ లైనప్ బాగా ఉపయోగపడుతుంది. హారర్ ఇష్టపడే వాళ్లు ‘వదల’, కామెడీ కోరుకునే వాళ్లు ‘కొరియన్ కనకరాజు’, యాక్షన్ ప్రియులు ‘డీసీ’ వైపు చూడొచ్చు.

పగటిపూట సాధువులు, రాత్రికి సైకోలు… గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live