Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big TV Live 1 week ago

Weekend habits that increase cancer risk| వీకెండ్ వచ్చిందంటే పార్టీలు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్, రాత్రివేళ సరదా సాధారణమే. కానీ రిలాక్స్ అవ్వడానికి చేసే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ముఖ్యంగా సిగరెట్, గుట్కా, మద్యం వంటివి అప్పుడప్పుడు మాత్రమే తీసుకున్నా ప్రమాదం ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పొగాకుతో క్యాన్సర్ ముప్పు ఎక్కువ

హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ అక్షత్ మాలిక్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) ఈ ప్రమాదాలపై హెచ్చరించారు. ఆయన ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. పొగాకు వాడకం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. గుట్కా, ఖైనీ, జర్దా, పొగాకు కలిపిన పాన్ వంటివి నోటికి హాని చేస్తాయి. ఇలాంటి పొగరహిత పొగాకు ఉత్పత్తులు నోటి లోపలి పొర, చిగుళ్లను దెబ్బతీయవచ్చు. వీటిలోని హానికరమైన రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్లు, బీడీల నుంచి వచ్చే పొగ కూడా నోటి, తల, మెడ క్యాన్సర్ల ముప్పును పెంచతుంది.

అప్పుడప్పుడు తీసుకునే పొగాకు కూడా అలవాటుగా మారొచ్చు

చాలామంది రోజూ సిగరెట్ తాగడం లేదని తమకు ప్రమాదం తక్కువగా ఉంటుందని భావిస్తారు. పార్టీలు, వీకెండ్‌లలో మాత్రమే తాగుతామని చెప్పుకుంటారు. అయితే పొగాకు ఏ రూపంలోనూ పూర్తిగా సురక్షితమైనది కాదు. అప్పుడప్పుడు చేసే అలవాటు క్రమంగా తరచుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఫ్రెండ్స్‌తో కలిసి చేసే 'సోషల్ స్మోకింగ్' సాధారణంగా కనిపిస్తోంది. కానీ సరదాగా మొదలైన అలవాటు తరువాత రోజువారీ జీవితంలో భాగమైతే ఆరోగ్యం సమస్యలు తీవ్రమవుతాయి.

మద్యం, పొగాకు కలిపి తీసుకోవడం మరింత ఆందోళనకరం

మద్యం, పొగాకు ఒకేసారి తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. మద్యం.. నోటి ఉపరితలంపై ప్రభావం చూపుతుంది. దీంతో పొగాకులోని క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలకు నోరు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నోరు, గొంతు క్యాన్సర్ల ప్రమాదం పెరగొచ్చు. వీకెండ్‌లో మాత్రమే మద్యం, సిగరెట్ తీసుకుంటున్నామని నిర్లక్ష్యం చేయకూడదు.

నోటిలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

నోటి క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. రెండు వారాలకు మించి తగ్గని నోటి పుండ్లను నిర్లక్ష్యం చేయకండి. నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నోరు తెరవడం, నమలడం కష్టంగా ఉండటం కూడా ఒక హెచ్చరిక. తినేటప్పుడు మంట లేదా నొప్పి కొనసాగితే టెస్ట్ చేయించుకోవాలి.

నాలుక లేదా నోటిలో గడ్డ, మందమైన భాగం కనిపించినా జాగ్రత్త అవసరం. మింగడంలో ఇబ్బంది, మెడలో నొప్పిలేని గడ్డ కూడా వైద్య పరీక్షకు కారణం కావచ్చు. గొంతు స్వరంలో ఎక్కువకాలం మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి లక్షణాలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా నిపుణుడిని సంప్రదించండి.

అలవాటు మానేయడంలో కుటుంబ సభ్యుల సహకారం

ఎవరైనా గుట్కా లేదా సిగరెట్‌కు అలవాటు పడితే వారిని అవమానించకూడదు. బదులుగా సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడాలి. చాలాసార్లు అప్పుడప్పుడు మొదలైన అలవాటు ఎప్పుడు రెగ్యులర్‌గా మారిందో వ్యక్తికే తెలియకపోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఆరోగ్యకరమైన మార్పులకు సహాయపడుతుంది.

వీకెండ్‌ను ఆరోగ్యకరంగా కూడా ఎంజాయ్ చేయాలి

వీకెండ్‌ను ఆస్వాదించడానికి సిగరెట్, గుట్కా లేదా మద్యం అవసరం లేదు. వర్కౌట్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీస్ ప్రయత్నించడం మంచిది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సమయం గడపడం, డ్యాన్స్ చేయడం, ఫొటోలు తీసుకోవడం కూడా మంచి మార్గాలే. చిన్న మార్పులు భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live