Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈపీఎఫ్ లో రూ.5 వేల పెట్టుబడితో రూ. 80 లక్షల ఫండ్.. ఎలా బిల్డ్ చేసుకోవచ్చంటే?

ఈపీఎఫ్ లో రూ.5 వేల పెట్టుబడితో రూ. 80 లక్షల ఫండ్.. ఎలా బిల్డ్ చేసుకోవచ్చంటే?

Big TV Live 2 weeks ago

EPFO Investment: ఉద్యోగుల పదవీ విరమణ కోసం ఫండ్ సేవ్ చేసుకునేందుకు ఈపీఎఫ్ ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసినంత కాలం ఈపీఎఫ్ కు ప్రతి నెలా చందా కట్టుకోవచ్చు.

వృద్ధాప్యంలో పీఎఫ్ ఆర్థిక భరోసా అందిస్తుంది. పదవీ విరమణ తర్వాత, ఈపీఎఫ్ సేవింగ్స్ రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఇతరులపై ఆధారపడకుండా జీవించేందుకు సహాయపడుతుంది.

ఈపీఎఫ్ ప్రస్తుతం సంవత్సరానికి 8.25% రాబడిని అందిస్తుంది. రాబడి తక్కువగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈపీఎఫ్, ఎఫ్డీ లాగా అంత సులభంగా ఉండకపోయినప్పటికీ, ఇందులో కొంతమేర విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు ఉన్నాయి. రెగ్యులర్ గా నెలకు రూ.5 వేల పెట్టుబడి పెడితే దాదాపు రూ. 80 లక్షల ఫండ్ ను కూడబెట్టుకోవచ్చు.

ఎలా పెట్టుబడి పెట్టాలి?

ఒక వ్యక్తి తన ఈపీఎఫ్ లో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, పదవీ విరమణ చేసే సమయానికి రూ. 80 లక్షల ఫండ్ ను కూడబెట్టవచ్చు. ఈ మొత్తం కోసం 30 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టాలి.

  • నెలకు పెట్టుబడి: రూ. 5,000
  • పెట్టుబడి పీరియడ్: 30 ఏళ్లు
  • రాబడి రేటు (ప్రస్తుతం): 8.25%
  • పెట్టుబడి మొత్తం: రూ. 18,00,000
  • రాబడి అంచనా: రూ. 60,95,002
  • మొత్తం విలువ: రూ. 78,95,002

ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను ఎలా?

ఈపీఎఫ్ మార్కెట్ లింక్డ్ ఫండ్స్ లాగా కేవలం కాంపౌండింగ్ అయ్యే పెట్టుబడి పథకం కాదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సాధారణంగా చెల్లింపుల మూల వేతనంలో 12% ఉంటాయి. గరిష్టంగా రూ. 15,000 పరిమితి ఉంటుంది. ఈపీఎఫ్ లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఎక్కువ మొత్తం పొదుపు చేసుకోవచ్చు. కంపెనీ యాజమాన్యాన్ని అధికారికంగా రిక్వెస్ట్ చేయవచ్చు. ఈపీఎఫ్ బెస్ట్ ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి సొంత చెల్లింపు రూ. 2.5 లక్షల లోపు ఉంటే, వచ్చే వడ్డీపై పన్ను ఉండదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live