Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం - 2023 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది.
కొత్త చట్టం ప్రకారం నియామక కమిటీలో ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత ఉండటాన్ని పిటిషనర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వానికి చెందినవారే ఉండటం వల్ల.. నిర్ణయాధికారం పూర్తిగా ఎగ్జిక్యూటివ్ (ప్రభుత్వం) చేతుల్లోనే ఉంటుందని వాదించారు.
కమిషనర్ల ఎంపికలో ప్రభుత్వం ఆధిపత్యం వహించడం వల్ల ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగంలోని ‘బేసిక్ స్ట్రక్చర్’ ప్రకారం ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలని పిటిషనర్లు పేర్కొన్నారు. కమీషనర్ల ఎంపిక కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) కూడా స్థానం ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు సైతం ఇచ్చిందని పిటిషనర్లు గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త చట్టం ద్వారా సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని చేర్చిందని పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమిటీ సభ్యుల్లో ఎగ్జిక్యూషన్ సభ్యులతో పాటు స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూదని ప్రశ్నించింది. ఇవాళ ప్రధాన మంత్రి ఒకరిని ఎంపిక చేస్తారని, రేపు ప్రతిపక్ష నాయకుడు మరొకరిని ఎంపిక చేస్తే పరిస్థితి ఏంటని అభిప్రాయపడింది. ఒక వేళ మూడో సభ్యుడు ప్రతిపక్ష నాయకుడికి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
పెంపుడు శునకాలకు.. వీధి కుక్కల రక్తం.. డాక్టర్లు చెప్పింది వింటే వణికిపోవాల్సిందే!
అయితే ద్విసభ్య ధర్మాసనం లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇవ్వడంలో కేంద్ర అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి తడబడ్డారు. ‘ఆచరణలో అలా జరగకపోవచ్చు. దాని గురించి ఇప్పుడే ఆలోచించ దలుచుకోలేదు’ అంటూ పేలవ వాదన వినిపించారు. అలాగైతే అంతా నియంత్రిస్తోందని కార్యానిర్వహక వర్గమే అంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా ఘాటుగా బదులిచ్చారు. సాధారణంగా ఎన్నికల కమిషనర్ల నియామకం 2:1 మెజారిటీతో ఆమోదింప బడుతుందని.. ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయంతో కేబినేట్ మంత్రి విభేదించే అవకాశం లేదని జస్టిస్ దత్తా అన్నారు. చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ అంతిమ నిర్ణేత మాత్రం సుప్రీంకోర్టు అనే ఆయన తేల్చి చెప్పారు.

