Earbuds Effects: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్‌తో పాటు 'ఇయర్‌బడ్స్' (Earbuds) ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ప్రయాణాలు, ఆఫీస్ పని, వ్యాయామం..
ఇలా సమయం ఏదైనా చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అయితే, వీటిని మితిమీరి వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read also-'పెద్ది' తర్వాత బుచ్చి బాబు ఏం చేయబోతున్నారో తెలుసా?.. దాని కోసమే..
ఎక్కువగా వాడితే..
వినికిడి లోపం: మన చెవులు సాధారణంగా 60-70 డెసిబెల్స్ శబ్దాన్ని భరించగలవు. కానీ చాలామంది ఇయర్‌బడ్స్‌లో 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్ పెడతారు. ఇలా ఎక్కువసేపు వినడం వల్ల లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతిని, శాశ్వతంగా వినికిడి శక్తి తగ్గుతుంది.
చెవి ఇన్ఫెక్షన్లు: ఇయర్‌బడ్స్ చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేయడం వల్ల లోపలికి గాలి ఆడదు. దీనివల్ల చెవిలో తేమ, వేడి పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి.
టిన్నిటస్: నిరంతరం ఇయర్‌బడ్స్ వాడేవారికి నిశ్శబ్ద వాతావరణంలో కూడా చెవిలో ఏదో ఈల వేసినట్లు, రింగుమనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
ఇయర్ వ్యాక్స్ పేరుకుపోవడం: ఇయర్‌బడ్స్ నిరంతరం పెట్టడం వల్ల చెవిలోని మెలిక (వ్యాక్స్) బయటకు రాకుండా లోపలికి నెట్టబడుతుంది. ఇది గట్టిపడి చెవి నొప్పి, తల తిరగడానికి కారణమవుతుంది.
మానసిక ఒత్తిడి: వీటి నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రభావం చూపి నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తాయి.
Read also-నటుడు జయం రవితో బ్రేకప్? చెన్నై వదిలి వెళ్తూ సింగర్ కెనీషా ఎమోషనల్ పోస్ట్!
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దీనికోసం '60/60 రూల్' పాటించాలి. అంటే వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువ ఉంచాలి, అలాగే రోజులో లేదా ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడకూడదు. ఇయర్‌బడ్స్‌ను క్రమంగా క్లీన్ చేస్తూ ఉండాలి ఇతరులతో పంచుకోకూడదు. సాంకేతికత సౌకర్యం కోసమే కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి కాదు. కాబట్టి ఇయర్‌బడ్స్ వాడకంలో పరిమితి పాటిస్తూ మన వినికిడి శక్తిని కాపాడుకుందాం.

