Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎలిమినేటర్ లో ఓడిపోయిన SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయర్

ఎలిమినేటర్ లో ఓడిపోయిన SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయర్

Big TV Live 2 weeks ago

Abrar Ahmed - ODI rankings: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 30వ తేదీన ప్రారంభమైన ఈ వన్డే సిరీస్, జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు కూడా ఫినిష్ అయ్యాయి. మొదటి వన్డేలో పాకిస్తాన్ గెలవగా, రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే, నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) రెండు వికెట్లు పడగొట్టి, అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ( icc odi bowling rankings) ఏడు స్థానాలు ఎగబాకి, నాలుగో స్థానంలో నిలిచాడు.

Short Circuit, Smoke In Team Bus: గుజరాత్ బస్సు ప్రమాదం వెనుక RCB కుట్ర..వైర్లు కట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోపణలు !

వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో అబ్రార్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండో వన్డేలో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో ఏడు స్థానాలు ఎగబాకిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, నాలుగో స్థానానికి ఎగబాకాడు. 633 పాయింట్లు సాధించిన అబ్రార్, నాలుగో స్థానానికి చేరుకోవడం గమనార్హం. అటు మొదటి స్థానంలో రషీద్ ఖాన్ ఉండగా, రెండో స్థానంలో జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. మూడో స్థానంలో కేశవ్ మహారాజ్ ఉన్నాడు. ఇండియా తరఫున కుల్దీప్ యాదవ్ ఆరో స్థానంలో నిలిచాడు. అటు నిన్న రెండో వన్డేలో మూడు వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) నాలుగు పాయింట్లు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు.

SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయర్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాపకు కూడా బిగ్ రిలీఫ్ ఇచ్చాడని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ది 100 లీగ్ టోర్నమెంట్ జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఇంగ్లాండులో జరగనుంది. ఇలాంటి క్రమంలో ఐసిసి ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్… ఆ టోర్నమెంటులో సన్ రైజర్స్ అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల జరిగిన వేలంలో ఏరి కోరి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య పాప. సన్రైజర్స్ లీడ్స్ జట్టుకు ఓనర్ గా ఈ టోర్నమెంట్లో కొనసాగుతున్నారు కావ్య. ఈ క్రమంలోనే బీసీసీఐ రూల్స్ కూడా బ్రేక్ చేసి మరి పాకిస్తాన్ స్పిన్నర్ ను కొనుగోలు చేశారు. 2.34 కోట్ల రూపాయలు అబ్రార్ అహ్మద్ పైన పోశారు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అబ్రార్ అహ్మద్ రాణించిన నేపథ్యంలో… ఓటమి బాధలో ఉన్న కావ్య ఊపిరి తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియాపై అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్.. ది 100 లీగ్ లో కూడా అద్భుతంగా రానిస్తాడని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live