Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఎల్లమ్మ' నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

'ఎల్లమ్మ' నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

Big TV Live 1 week ago

Ellamma First Look Update: వేణు యెల్దండి…'బలగం' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ పేరు టాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఎలాంటి హంగులు లేకుండా పల్లెటూరి మనుషుల జీవితాలు, బంధాలు,భావోద్వేగాలను చాలా సహజంగా చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు వేణు.

ఇప్పుడు అదే నమ్మకంతో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే 'ఎల్లమ్మ'.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు తన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాలకు ప్రాణం పోసిన దేవిశ్రీ.. ఇప్పుడు ఏకంగా హీరోగా తెరపై కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఆగస్టు 2న 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్‌

దేవిశ్రీ ప్రసాద్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అదిరిపోయే మ్యూజిక్. ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి.. ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ పాత్ర ఎలా ఉండబోతుంది? అతని లుక్ ఎలా ఉంటుంది? అనే విషయాలు ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉన్నాయి.

ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 2న 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన చిన్న అప్డేట్‌ను మేకర్స్ వదలడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై డిబేట్ మొదలైంది.

'ఎల్లమ్మ'పై భారీ అంచనాలు

ముఖ్యంగా 'బలగం' తర్వాత వేణు యెల్దండి నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఎల్లమ్మ'పై భారీ అంచనాలు ఉన్నాయి. 'బలగం'లో చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో ఎమోషనల్‌గా చూపించిన వేణు.. ఈసారి యాక్షన్ టచ్ ఉన్న కథను ఎలా తెరకెక్కించాడా అంటూ ఈగర్ ఫా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.

ఇప్పటి వరకైతే రూమర్స్ మాత్రమే తప్ప హీరోయిన్ ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. అయితే కథకు తగ్గట్టుగా మంచి నటిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణు సినిమాల్లో హీరోతో పాటు మిగతా పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్ క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకంగా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

'ఎల్లమ్మ'కు ఆయన ఎలాంటి పాటలు ఇస్తాడో

మరో స్పెషల్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు హీరోగా నటించడమే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం అందిస్తున్నాడు. అంటే ఒకే సినిమాలో దేవి నటనతో పాటు అతని మ్యూజిక్ కూడా ఉండబోతోందన్న మాట. సాధారణంగా దేవి పాటలకు ఉండే ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మరి 'ఎల్లమ్మ'కు ఆయన ఎలాంటి పాటలు ఇస్తాడో చూడాలి.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకులకు అందించే దిల్ రాజు.. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు విలేజ్ స్టోరీలని ఎంతలా ఆదరిస్తారో చెప్పక్కర్లేదు. 'రంగస్థలం', 'ఉప్పెన', 'పుష్ప' లాంటి సినిమాలు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు 'ఎల్లమ్మ' కూడా అదే రూట్‌లో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. హీరోగా కూడా మెప్పిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 'బలగం' తర్వాత వేణు యెల్దండి తన క్రేజ్‌ను కొనసాగిస్తాడా అన్నది కూడా చూడాలి.

ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో

మొత్తానికి 'ఎల్లమ్మ'పై ఇప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కొత్త అవతారం, వేణు యెల్దండి కొత్త కథ.. ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live