Nagarjuna Sagar: నాగార్జునసాగర్ మళ్లీ జల వివాదానికి కేంద్రంగా మారింది. ఏపీ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేయగా..
తెలంగాణ ఎడమ కాల్వ నుంచి అదే స్థాయిలో నీటిని రిలీజ్ చేసింది. తాగునీటి అవసరాల కోసమే అని ఏపీ కారణంగా చెబుతుండగా.. తెలంగాణ మాత్రం KRMB అనుమతి, కోఆర్డినేషన్ లేకుండా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో.. కృష్ణా జలాల వినియోగంపై KRMB కీలక నిర్ణయాన్ని సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. ఎల్‌నినో పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వాడాలని బోర్డు ఇప్పటికే సూచించింది.
Also read: నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్డీవో మాజీ డైరెక్టర్ సహా.. మరో 30 మంది సేఫ్!
అసలు సమస్య కాదా?
కీలక సమయంలో త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయం వాయిదా పడితే.. రాష్ట్రాలు తమ దారిన తాము నీటిని విడుదల చేసుకోవడమే పరిష్కారమా? ప్రతి అత్యవసర పరిస్థితికి స్పష్టమైన విడుదల ప్రొటోకాల్ లేకపోవడమే అసలు సమస్య కాదా? జల వివాదానికి పరిష్కారం కావాలంటే.. రాజకీయ ఆరోపణలు కాదు, పారదర్శక లెక్కలు, రియల్‌టైమ్ పర్యవేక్షణ, వేగవంతమైన KRMB నిర్ణయాలే అవసరం అన్న వాదనైతే వినిపిస్తోంది.

