Epic Teaser: బేబీ సినిమాతో హిట్ జోడిగా నిలిచిన ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య మరోసారి వెండి తెరపై జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవి చైతన్య ఆనంద దేవరకొండ హీరో హీరోయిన్లుగా ఎపిక్(Epic) ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.90s, ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోని తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ఈ టీజర్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 90 s వెబ్ సిరీస్(90s web series) లోని ఆదిత్య పాత్ర పెద్దయిన తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయడం యూకేకి వెళ్లి అక్కడ అమ్మాయితో ప్రేమలో పడటం వల్ల ఏం జరిగింది కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ముద్దు సన్నివేశాలతో టీజర్..
ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే అమ్మాయిలు అంటే మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే ఆదిత్య ఏకంగా ఒక అమ్మాయిని ప్రేమలో పడేస్తారు అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) తల్లితండ్రులుగా శివాజీ(Sivaji), వాసుకి ఆనంద్(Vasuki Anand) నటించిన. ఇక ఈ టీజర్ వీడియో మొత్తం రొమాంటిక్ సీన్లతో లిప్ కిస్ సీన్లతో ఉందని చెప్పాలి. ఈ టీజర్ చూస్తుంటే బేబీ సీక్వెల్ సినిమా రాబోతోందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

