Dailyhunt
ఏపీకి బిగ్ బూస్ట్- ఏరో స్పేస్ ప్రాజెక్ట్.. ఆ జిల్లాలో ప్లాంట్, దాదాపు లక్ష కోట్ల వరకు పెట్టుబడి, భూముల కేటాయింపు

ఏపీకి బిగ్ బూస్ట్- ఏరో స్పేస్ ప్రాజెక్ట్.. ఆ జిల్లాలో ప్లాంట్, దాదాపు లక్ష కోట్ల వరకు పెట్టుబడి, భూముల కేటాయింపు

Big TV Live 1 week ago

DRDO Invest: ఏపీలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అమల్లోకి వస్తున్నాయి. తాజాగా ఏపీకి మరొక భారీ పెట్టుబడి వచ్చింది.

ప్రపంచానికి తన సత్తాను చాటి చెప్పే అత్యాధునిక ఐదో తరం ఫైటర్ జెట్స్ తయారీకి ఏపీ కేంద్రంగా మారబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఏపీకి మరొక బూస్ట్.. పుట్టపర్తికి ఏరోస్పేస్ ప్రాజెక్ట్

ఉమ్మడి అనంతపురం పేరు చెప్పగానే ముందుగా కియా కార్ల పరిశ్రమ గుర్తుకు వస్తుంది. ఆ కార్ల ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఆ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. తాజాగా ఆ జిల్లాకు మరొక రక్షణ రంగ ప్రాజెక్టు రాబోతోంది. దానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలు అక్కడ కొలువు తీరనున్నాయి. దీనిద్వారా ఏపీ ఏరోస్పేస్-రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడి రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అనుబంధ సంస్థలు రావడం ఖాయమని అంచనా వేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ ప్రాజెక్టు రానుంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDOకు చంద్రబాబు కేబినెట్ 600 ఎకరాల భూమిని కేటాయించింది.

దాదాపు లక్ష కోట్ల వరకు పెట్టుబడి.. ఆపై భూముల కేటాయింపు

అవసరమైతే అదనంగా భూమి కేటాయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద సుమారు 140 అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-AMCA లను ఈ ప్రాంతంలో తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు 50 కిలో మీటర్ల దూరంలో పుట్టపర్తి ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కొత్త ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించనుంది. DRDO ఆధ్వర్యంలో పని చేస్తున్న స్వయంప్రతిపత్తి గల సంస్థ ఇది. రక్షణ విమానాల రూపకల్పనలో ఈ సంస్థకు అపారమైన అనుభవం ఉంది.

బెంగళూరులో తయారైన విడిభాగాలను 50 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తికి తరలించనున్నారు. ప్రోటోటైప్‌ల అసెంబ్లీ, గ్రౌండ్ టెస్టింగ్ ప్రక్రియలు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ప్రధాన కేంద్రానికి సమీపంలో ఉండడం, లాజిస్టిక్స్ పరంగా ప్రయోజనం చేకూరుతుందని అధికారుల అంచనా. అందుకే ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

కలియుగ దైవంతో ఆటలా? మాజీ సీఎం జగన్‌కు మంత్రి లోకేశ్ వార్నింగ్

ADA టీమ్ ఇప్పటికే పుట్టపర్తి భూమిని పరిశీలించింది. తమ అవసరాలకు సరిపోతుందని నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై చంద్రబాబు కేబినెట్‌లో చర్చించడం, ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఏరో స్పేస్ రంగం అభివృద్ధి చెందుతుందని అంచనా.

ఈ ప్రాజెక్టు వల్ల అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. దీనిద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గతేదాడి ఈ ప్రాజెక్టు కోసం కూటమి సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందంటూ కర్ణాటక ప్రభుత్వం విమర్శించిన విషయం తెల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live