Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మహిళపై అత్యాచారం

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మహిళపై అత్యాచారం

Big TV Live 1 week ago

Palnadu: పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని, తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.

అయితే, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్ధరాత్రి మాట్లాడాలంటూ ఆ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి గ్రామ శివారుకు రప్పించాడు.

అక్కడికి చేరుకునే సరికే ప్రియుడు, అతని సోదరుడు పూర్తిస్థాయిలో మద్యం మత్తులో ఉన్నారు. ఒంటరిగా వచ్చిన సదరు మహిళను చూసి ఇద్దరూ కలిసి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఘోరానికి ఒడిగట్టారు. మొబైల్‌లో వీడియోలు తీస్తూ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ఒక గ్రామ సచివాలయ ఉద్యోగి కావడం గమనార్హం. కేవలం ఈ ఘటనే కాకుండా, గతంలోనూ అతనిపై పలు మోసపూరిత కేసులు నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. కామాంధుల చేతిలో దారుణానికి గురైన ఆ బాధితురాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ న్యాయం కోసం ఎదురుచూస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live