Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏసీ కొనే ప్లాన్ ఉందా? ఈ 'కాపర్ కండెన్సర్' సీక్రెట్ తెలియకపోతే మీ డబ్బులు వేస్ట్ అయినట్టే!

ఏసీ కొనే ప్లాన్ ఉందా? ఈ 'కాపర్ కండెన్సర్' సీక్రెట్ తెలియకపోతే మీ డబ్బులు వేస్ట్ అయినట్టే!

Big TV Live 2 months ago

Best Inverter ACs: ప్రస్తుతం ఎండల పరిస్థితి ఎలా ఉందంటే.. మిట్ట మధ్యాహ్నం వేళలో గనుక బయటకు అడుగు పెట్టామంటే మాడిపోయేలా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో కాక పుట్టిస్తున్న ఉష్ణోగ్రతల వల్ల ఏసీ లేనిదే ఒక్క నిమిషం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది.

దీంతో ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఏసీలు ఆన్‌లో ఉండాల్సిందే. అయితే, గది చల్లబడటంతో పాటు కరెంట్ బిల్లు మోత మోగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే మార్కెట్లో ఇప్పుడు కాపర్ కండెన్సర్ ఉన్న ఇన్వర్టర్ ఏసీలకు డిమాండ్ బాగా పెరిగింది. వోల్టాస్, ఓ జనరల్, డైకిన్, బ్లూ స్టార్, క్రోమా వంటి ప్రముఖ బ్రాండ్లు సరికొత్త మోడళ్లతో మన ముందుకు వచ్చాయి.

కాపర్ కండెన్సర్ ఎందుకు బెస్ట్?

ఏసీ కొనేటప్పుడు అల్యూమినియం కండెన్సర్ కంటే కాపర్ కండెన్సర్ ఉన్న వాటిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. కాపర్ చాలా వేగంగా వేడిని గ్రహించి, గదిని త్వరగా చల్లబరుస్తుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ కాలం మన్నుతుంది. అలాగే, భవిష్యత్తులో ఏదైనా రిపేర్ వచ్చినా కాపర్ కండెన్సర్‌ను సులభంగా బాగు చేయొచ్చు. ఇది ఏసీ లైఫ్‌ను పెంచడమే కాకుండా.. లాంగ్ రన్‌లో కూడా కరెంటును ఆదా చేస్తుంది.

కరెంట్ బిల్లు తగ్గించే ఇన్వర్టర్ టెక్నాలజీ:

సాధారణ ఏసీలతో పోలిస్తే.. ఇన్వర్టర్ ఏసీలు గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా వాటి కంప్రెసర్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటాయి. దీనివల్ల గది ఎప్పుడూ ఒకేలాంటి చల్లదనంతో హాయిగా ఉంటుంది. అంతేకాదు.. కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కాకపోవడం వల్ల విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. అలాగే రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి ఇవి తక్కువ శబ్దంతో పనిచేస్తూ చక్కటి నిద్రను అందిస్తాయి.

ఏసీలు, కూలర్లు లేని ఆ కాలంలో.. 500 ఏళ్ల క్రితమే రాజుల కోటలు ఎలా చల్లగా ఉండేవో తెలుసా?

గదికి తగ్గ ఏసీని ఎంచుకోవడమెలా?

ఏసీ కొనే ముందు గది పరిమాణాన్ని బట్టి టన్నును ఎంచుకోవడం ముఖ్యం. చిన్న బెడ్‌రూమ్‌లు లేదా స్టడీ రూమ్‌లకైతే 1 టన్ ఏసీ సరిపోతుంది. అదే మీడియం సైజ్ రూమ్‌లకు 1.5 టన్, పెద్ద లివింగ్ రూమ్‌లు లేదా హాల్స్ కోసం 2 టన్ ఏసీలు అవసరమవుతాయి. గది సైజుకు తగిన ఏసీని ఎంచుకోకపోతే.. కూలింగ్ సరిగ్గా రాకపోగా కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

బెస్ట్ ఎయిర్ కండీషనర్స్ ఏవంటే?

మీరు గనుక ఏ మోడల్ కొనాలో అర్థం కాక గందరగోళంలో ఉంటే.. కొన్ని నమ్మకమైన ఆప్షన్లు ఉన్నాయి. చిన్న గదుల కోసం Daikin 1 Ton 5 Star Inverter Split AC అద్భుతంగా పనిచేస్తుంది. దీని 5 స్టార్ రేటింగ్ వల్ల కరెంట్ బిల్లు అస్సలు భారం కాదు. ఒకవేళ మీది పెద్ద హాల్ లేదా ఉమ్మడి కుటుంబం అయితే.. O General 2 Ton 3 Star Inverter Split AC బెస్ట్ ఛాయిస్. ఇది తీవ్రమైన ఎండల్లోనూ గది మూలమూలకూ వేగంగా గాలిని అందిస్తుంది.

5 స్టార్ ఏసీలే ఎందుకు బెస్ట్?

కొత్త ఏసీ కొనేటప్పుడు స్టార్ రేటింగ్, కూలింగ్ కెపాసిటీ, మెయింటెనెన్స్ ఖర్చులను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. 5 స్టార్ రేటింగ్ ఏసీలు ప్రారంభంలో కొంచెం ధర ఎక్కువ అనిపించినా.. భవిష్యత్తులో కరెంట్ బిల్లుల రూపంలో మీ సొమ్మును ఆదా చేస్తాయి. కాపర్ కండెన్సర్, ఇన్వర్టర్ ఫీచర్లు ఉన్న ఏసీని ఎంచుకుంటే ఈ వేసవి కాలం హాయిగా, ప్రశాంతంగా గడిచిపోతుంది.

జస్ట్ రూ.15 ఖర్చు పెడితే చాలు.. ఇల్లంతా కూల్ అయిపోద్ది.. ఇక ఏసీ కూడా ఆన్ చేయరు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live