Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం, ఇద్దరు భారతీయులు మృతి

ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం, ఇద్దరు భారతీయులు మృతి

Big TV Live 2 days ago

MountEverest Tragedy: ఎవరెస్ట్‌ శిఖరంపై ఊహించని విషాదం చోటు చేసుకుంది. శిఖరానికి చేరుకున్న దిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు.

ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులు ఒకరు అరుణ్‌ కుమార్‌ తివారీ, మరొకరు సందీప్‌గా గుర్తించారు.

ఎవరెస్ట్‌ శిఖరం.. అంతులేని విషాదం

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌. దీన్ని అధిరోహించిన సగటు పర్వతారోహకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే ఆ శిఖరాన్ని చేరుకుని క్షేమంగా చేరుకున్నారు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో చాలామంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా బుధవారం ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు 274 మంది పర్వతారోహకుల టీమ్. అందులో ఇండియాకు చెందిన సందీప్‌ ఆరే, తులసి రెడ్డి, అజయ్ పాల్ సింగ్ తోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఒక రోజులో అధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన టీమ్‌గా కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.

శిఖరం తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయులు మృతి

శిఖరం నుంచి కిందకు దిగుతున్న సమయంలో సందీప్‌ ఆరే, అరుణ్‌ కుమార్‌ తివారీ మృతి చెందినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని తెలిపారు. వారిని రక్షించేందుకు గైడ్స్‌ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరణించినవారు వేర్వేరు బృందాల్లో సభ్యులు.

బుధవారం ఒకరు, గురువారం మరొకరు మృత్యువాత పడ్డారు. ఒకరు దిగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు బేస్ క్యాంప్‌కు వచ్చినప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

హోండూరస్‌లో చిచ్చు మొదలైంది.. రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి

మరోవైపు శిఖరాగ్రానికి చేరుకోవడానికి పర్వతారోహకులకు తాడు బిగించే పని మే 13న పూర్తయింది. దీంతో ఈ ఏడాది అధిరోహణ సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి 493 అనుమతులు జారీ చేశారు నేపాల్ అధికారులు. ఈ ఏడాది అధిక సంఖ్యలో పర్వతారోహకులు వచ్చారు. 1953లో టెన్జింగ్ నార్గే-సర్ ఎడ్మండ్ హిల్లరీ తొలిసారి ఈ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. అప్పటి నుంచి ఒక ఏడాదిలో జారీ చేయబడిన అనుమతులలో ఇదే అత్యధికం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live