Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big TV Live 1 week ago

Teacher Murder: ఫరీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. తరగతి గదిలోనే 30 ఏళ్ల లేడీ టీచర్‌ను, 21 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు.

కేవలం 30 నుంచి 40 సెకన్ల వ్యవధిలోనే ఆవేశంతో రగిలిపోతూ ఆమె మెడ, ఛాతీ, కడుపు భాగాల్లో కత్తితో ఏకంగా 25 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వీరిద్దరికీ గత రెండేళ్లుగా పరిచయం ఉంది. అయితే కొంతకాలంగా ఆ యువకుడు ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అతడి వేధింపులు తట్టుకోలేక లేడీ టీచర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు కావడంతో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షను ఆ యువకుడు పెంచుకున్నాడు. ఆ కోపంతోనే పక్కా పథకం ప్రకారం స్కూల్‌లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live