Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

Big TV Live 3 weeks ago

Philips TAS4400BK Bluetooth speaker: మ్యూజిక్ లవర్స్ అందరికీ క్రిస్టల్ క్లియర్ సౌండ్, దద్దరిల్లే బేస్ అంటే ఎంతో ఇష్టం. హౌస్ పార్టీలైనా, ఇంట్లో ప్రశాంతంగా పాటలు వినాలాలన్నా..

మంచి స్పీకర్ ఉండాల్సిందే. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ మ్యూజిక్ లవర్స్ కోసం మార్కెట్లోకి ‘TAS4400BK/94’ మోడల్‌లో అద్భుతమైన బ్లూటూత్ స్పీకర్‌ను తెచ్చింది. కేవలం రూ.2,749 బడ్జెట్ ధరలో.. లభిస్తున్న ఈ స్పీకర్ ఏకంగా 40 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్‌ను అందిస్తుంది. తక్కువ ధరలో .. హై-క్వాలిటీ మ్యూజిక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ స్పీకర్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మార్కెట్లో ఎన్నో బ్రాండ్ల స్పీకర్లు ఉన్నప్పటికీ..పిలిప్స్ అందించే ఆడియో క్వాలిటీ ,నమ్మకమే వేరు. సాధారణంగా పెద్ద స్పీకర్లు కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ బడ్జెట్ ధరలోనే.. అదిరి పోయే సౌండ్ అవుట్‌ పుట్ ఇచ్చేలా ఫిలిప్స్.. ఈ మోడల్‌ను డిజైన్ చేసింది. డీప్ బ్లాక్ కలర్, మోనో ఛానల్ సపోర్ట్‌తో వస్తున్న.. ఈ స్పీకర్ లుక్ పరంగానూ చాలా మోడర్న్‌గా ఉంటుంది.

40 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్,బేస్:

ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని పవరే. కేవలం రూ.2,700 రేంజ్‌లో ఏకంగా 40 వాట్ల సౌండ్ అవుట్‌ పుట్‌ను ఇది అందిస్తుంది. చిన్న రూమ్ పార్టీలకైనా, ఇండోర్ గ్యాథరింగ్‌కైనా ఈ సౌండ్ సరిగ్గా సరి పోతుంది. పాటల్లోని ప్రతి బీట్ స్పష్టంగా వినిపించడంతో పాటు.. బాస్ లవర్స్‌ను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. మోనో ఛానల్ డిజైన్ అయినప్పటికీ, ఆడియో క్లారిటీ విషయంలో ఫిలిప్స్ ఎలాంటి రాజీ పడలేదు.

కనెక్టివిటీ, డిజైన్:

ఈ బ్లూటూత్ స్పీకర్‌ను స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ.. ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సిగ్నల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనికి.. తోడు డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉండటంతో దీన్ని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లొచ్చు. ట్రిప్స్‌కి వెళ్లేటప్పుడు లేదా అవుట్‌డోర్ పిక్నిక్‌ల సమయంలో.. బ్యాగులో సర్దుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్:

మ్యూజిక్ లవర్స్ ఎక్కువగా కోరుకునేది మంచి బ్యాటరీ బ్యాకప్. ఈ ఫిలిప్స్ స్పీకర్ పవర్‌ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. కాబట్టి ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఎలాంటి టెన్షన్ లేకుండా గంటల తరబడి నిరంతరం పాటలను ఆస్వాదించవచ్చు. తక్కువ సమయం లోనే.. ఫాస్ట్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉండటం దీనికి మరో ప్లస్ పాయింట్.

ధర :

ఇన్ని అద్భుతమైన ఫీచర్లు, 40 వాట్ల పవర్‌ ఫుల్ సౌండ్‌తో వస్తున్న.. ఈ ఫిలిప్స్ TAS4400BK/94 బ్లూటూత్ స్పీకర్ ధర మార్కెట్లో.. కేవలం రూ.2,749 మాత్రమే. బడ్జెట్ తక్కువగా ఉండి, బ్రాండెడ్, హై-క్వాలిటీ సౌండ్ ఇచ్చే స్పీకర్ కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live