Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర.. ఐఫోన్, గూగుల్, శాంసంగ్ ఫోన్లపై.. కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర.. ఐఫోన్, గూగుల్, శాంసంగ్ ఫోన్లపై.. కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

Big TV Live 1 month ago

Flipkart Sasa Lele Sale 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. మరో భారీ సేల్ తీసుకొస్తోంది. సమ్మర్ స్పెషల్ లో భాగంగా 'సాసా లేలే' (Sasa Lele) సేల్‌ను అధికారికంగా ప్రకటించింది.

ఈ సేల్ లో ఐఫోన్ 17, శామ్‌సంగ్ గెలాక్సీ S25 వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఏ మోడల్స్ పై ఎంత డిస్కౌంట్ రానుంది? ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు ఇవ్వనున్నారు? వంటి విషయాలను ఫ్లిప్ కార్ట్ వర్గాలు వివరించాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

సేల్ ప్రారంభం ఎప్పుడంటే?

ఫ్లిప్‌కార్ట్ తన సమ్మర్ షాపింగ్ ఈవెంట్ ‘Sasa Lele 2026’ ప్రారంభ తేదీలను ఖరారు చేసింది. వినియోగదారులకు వేసవి విరామంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై అదిరిపోయే డీల్స్ అందించడమే లక్ష్యంగా ఈ సేల్‌ను తీసుకొస్తోంది. మే 9వ తేదీ నుంచి ఈ సేల్ మెుదలు కానున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు మే 8వ తేదీ అర్ధరాత్రి నుంచే అంటే ఒకరోజు ముందు నుంచే సేల్ కు యాక్సెస్ లభిస్తుందని పేర్కొన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న కొన్ని డీల్స్ ను ఫ్లిప్ కార్ట్ ముందే హైలెట్ చేసింది. ఐఫోన్ 17 (iPhone 17) మెుబైల్ ను.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు పోనూ సుమారు రూ.71,900కే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 (Samsung Galaxy S25) లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ పై కూడా భారీ తగ్గింపును ఈ సేల్ లో ఆశించవచ్చని నిపుణులు అంటున్నారు. దీని ధర సుమారు రూ.54,999 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

బ్యాంక్ ఆఫర్లు

ఈ సేల్ లో లభించే బ్యాంక్ ఆఫర్లను సైతం ఫ్లిప్ కార్ట్ అధికారికంగా ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలపై 10% డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రైబర్లు.. కొన్ని ఎంపిక చేసిన డీల్స్‌పై 15 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. సేల్ సమయంలో ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు ‘బ్రాండ్ అవర్స్’ (Brand Hours).. మధ్యాహ్నం 12 గంటలకు ‘రష్ అవర్’ (Rush Hour) వంటి ప్రత్యేక సమయాల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఫ్లిప్ కార్ట్ వర్గాలు తెలిపాయి.

రూ. 123, రూ.234, రూ.369.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్లాన్స్.. బోలెడన్ని బెనిఫిట్స్ భయ్యా!

ఏసీలపై 80% వరకూ డిస్కౌంట్!

కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌లు (శాంసంగ్ గెలాక్సీ బుక్, అసస్ ఎక్స్ పర్ట్ బుక్), స్మార్ట్ టీవీలు, ఏసీలపై కూడా 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా పేర్కొంది. కొత్త ఫోన్, ఏసీ, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనాలనుకునే వారికి మే 9 నుండి ప్రారంభమయ్యే ఈ ‘సాసా లేలే’ సేల్ ఒక మంచి అవకాశమని ఫ్లిప్ కార్ట్ వర్గాలు సూచిస్తున్నాయి.

అమెజాన్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, మెుబైల్స్.. కళ్లుచెదిరే ఆఫర్లు భయ్యా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live