Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big TV Live 2 weeks ago

Nagadurga OTT:ఫోక్ క్వీన్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా వెండి తెరపై సత్తా చాటేందుకు రెడీ అయిపోయింది.ఈ క్రమంలోనే తమిళ నాట 'లవ్ ఓ లవ్' సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.అయితే సక్సెస్ పరంగా సినిమా అంతంత మాత్రంగానే వసూల్లని రాబట్టిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా దూసుకెళ్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ లిస్టులో ‘లవ్ ఓ లవ్’

ఈ మధ్యే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘లవ్ ఓ లవ్’ విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం.ఇక ఇదే క్రమంలో స్ట్రీమింగ్‌లో ఉన్న కొన్ని హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి ఈ మూవీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ఇక్కడ మరో విశేషం.ఇక ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కూ మంచి ఆదరణ లభిస్తుండటంతో మంచి వ్యూస్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

విడుదలైన ఐదు రోజుల్లోనే రెండు మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ రావడం మెచ్చుకోతగ్గ విశేషం.ముఖ్యంగా నాగదుర్గ నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో చూపించిన నటనపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోక్ ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలిసిన నాగదుర్గ.. హీరోయిన్‌గా కూడా ఆకట్టుకోగలదని ఈ సినిమాతో నిరూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్

ఈ సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ నటించాడు. కొత్త జంటగా పవీష్, నాగదుర్గ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందని సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ చూస్తేనే అర్థమవుతోంది. దర్శకుడు మగీష్ రాజేంద్రన్ ఈ చిత్రాన్ని నేటి యువత ప్రేమ,పెళ్లి, బాధ్యతలు, డబ్బు విషయంలో ఎలా ఆలోచిస్తుందనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందించాడు.

కథ విషయానికి వస్తే..

కథ విషయానికి వస్తే.. రఘు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. అప్పులు చేయడం ఇష్టం లేని రఘు.. అవంతికను ప్రేమిస్తాడు. కానీ ప్రేమ పేరుతో అవంతిక చేసే ఖర్చులు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా రఘు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కుటుంబ సభ్యులతో కూడా దూరమవుతాడు. చివరకు దేశం విడిచి దుబాయ్ వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు.

అయితే పరిస్థితులు అనుకోని మలుపు తిరిగి మహిళా మండలి నాయకురాలు పెట్టిన కేసు కారణంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుంచి అతని జీవితం ఎలా మారింది? అవంతికతో అతని ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? చివరకు రఘు తన జీవితాన్ని ఎలా గాడిలో పెట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఈ ఫోక్ క్వీన్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్తుందో

అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయల మార్కును కూడా దాటలేకపోవడం గమనార్హం.కానీ అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు oTT లో ఈ సినిమాను చూసి తెగ మెచ్చేసుకుంటున్నారు.మొత్తానికి నాగదుర్గకు హీరోయిన్‌గా ఇదొక మంచి బిగినింగ్ అనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా ప్రియదర్శితో ఇడుపు కాయితం అనే మరో సినిమాకి నాగ దుర్గ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే.చూడాలి ముందు ముందు ఈ ఫోక్ క్వీన్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్తుందో !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live