Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?

ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?

Big TV Live 2 weeks ago

Speaker Holes: కొత్త ఫోన్ కొనేటప్పుడు కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీతో పాటు చాలా మంది గమనించేది స్పీకర్లు. అయితే స్పీకర్ల డిజైన్ అన్ని ఫోన్లలో దాదాపు ఒకే రకంగా ఉంటుంది.

చిన్న చిన్న రంధ్రాలతో అవి దర్శమనిస్తుంటాయి. అయితే రంధ్రాలన్నింటి నుండి సౌండ్ రాదన్న విషయం మీకు తెలుసా? కేవలం కొన్ని రంధ్రాల నుండి మాత్రమే పాటలు, రింగ్ టోన్ శబ్దాలు వినిపిస్తాయట. మరి కంపెనీలు అన్ని రంధ్రాలు ఎందుకు ఇస్తాయి? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లుక్ అండ్ డిజైన్

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్‌ను డిజైన్ చేసేటప్పుడు ‘సిమెట్రీ’కి చాలా ప్రాధాన్యత ఇస్తాయి. అంటే ఫోన్ ఫైబాగంతో పాటు కింది భాగం కూడా చూడ్డానికి ఫ్లాట్ గా అందంగా కనిపించాలని భావిస్తుంటాయి. ఒకవైపు మాత్రమే రంధ్రాలు ఉండి మరోవైపు ఖాళీగా ఉంటే ఫోన్ లుక్ పాడవుతుందని కంపెనీల అభిప్రాయం. అందుకే ఛార్జింగ్ పోర్ట్‌కు ఇరువైపులా సమానంగా రంధ్రాలను డిజైన్ చేస్తాయి. తద్వారా ఫోన్ లుక్ ను మరింత ప్రీమియంగా మార్చేస్తాయి.

మైక్రోఫోన్ రహస్యం

ఫోన్ మాట్లాడేటప్పుడు వాయిస్ అవతలి వారికి వినిపించాలంటే ఫోన్‌లో మైక్రోఫోన్ తప్పనిసరి. అయితే ఆ మైక్రోఫోన్ ను ఈ స్పీకర్ గ్రిల్స్ వెనుకే ఫిక్స్ చేస్తారు. ఒకవైపు ఉన్న రంధ్రాల నుండి స్పీకర్ సౌండ్ బయటకు వస్తే.. మరోవైపు ఉన్న రంధ్రాల వెనుక మైక్రోఫోన్ ఉంటుంది. మనం మాట్లాడే మాటలు ఈ రంధ్రాల ద్వారానే మైక్రోఫోన్‌కు చేరతాయి.

ప్రెజర్ ఈక్వలైజేషన్

స్మార్ట్‌ఫోన్లు సన్నగా, లోపల ఎలాంటి గాలి చొరబడకుండా ప్యాకింగ్ తో వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫోన్ లోపల, బయట గాలి ఒత్తిడి సమానంగా ఉండటం ఎంతో అవసరం. ఒకవేళ ఒత్తిడిలో తేడాలు వస్తే స్పీకర్ డయాఫ్రాగమ్ సరిగ్గా పనిచేయదు. సౌండ్ క్వాలిటీ పాడవుతుంది. కాబట్టి కొన్ని రంధ్రాలు ఫోన్ లోపలి గాలి ఒత్తిడిని నియంత్రించడానికి, బేరోమెట్రిక్ సెన్సార్లకు గాలి అందడానికి సహాయపడతాయి.

డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్

ఫోన్ కు అన్ని రంధ్రాలు ఉన్నప్పటికీ.. దుమ్ము, దూళి లోపలికి వెళ్లకుండా కంపెనీలు తగిన జాగ్రత్తలు పాటిస్తుంటాయి. ఈ రంధ్రాల్లో ఒక ప్రత్యేకమైన నెట్ (Mesh) లేదా ప్రొటెక్టివ్ లేయర్‌ను ఏర్పాటు కంపెనీ ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల రంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫోన్ లోపల ఉండే సున్నితమైన భాగాలకు ఎలాంటి నష్టం జరగదని నిపుణులు పేర్కొంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live