Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాంధీ భవన్‌లో రగులుతున్న 'జెన్ జీ' రాజకీయం.. అధిష్టానానికి కొత్త సవాలు!

గాంధీ భవన్‌లో రగులుతున్న 'జెన్ జీ' రాజకీయం.. అధిష్టానానికి కొత్త సవాలు!

Big TV Live 2 months ago

Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వేళ.. యంగ్ లీడర్లు చేస్తున్న హంగామా ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.

సీనియారిటీని పక్కనపెట్టి జెన్ జీకి మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్లు.. గాంధీ భవన్ వర్గాల్లో మంటలు రాజేస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓపెన్‌గానే జెన్ జీ నినాదాన్ని ఎత్తుకోవడం.. సోషల్ మీడియాలో కొందరు నేతలు తమను తాము అప్‌కమింగ్ మినిస్టర్లుగా ప్రొజెక్ట్ చేసుకోవడం.. ఇప్పుడు అధిష్టానానికే పెద్ద సవాలుగా మారింది.

యువతకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ అనుభవాన్ని, దశాబ్దాల రాజకీయ పోరాటాలు చేసిన సీనియర్లను పక్కన పెట్టి.. కేవలం జెన్ జీ పేరుతో కేటాయింపులు చేయడం సాధ్యమేనా? ఇది కేవలం సోషల్ మీడియా హైప్ కోసం, అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు వేస్తున్న రాజకీయ ఎత్తుగడ అనేవాళ్లు కూడా ఉన్నారు. యంగ్ లీడర్ల డిజిటల్ ప్రచారం, పాత నేతల సీనియారిటీ నడుమ ఈ జెన్ జీ రాజకీయం ఎటు వెళ్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live