Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. రేపో మాపో సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇంతకీ విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేంటి? డీఎంకె, అన్నాడీఎంకె మాదిరిగా కోతలు పెడతారా? ఇవే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది.
కాబోయే సీఎం విజయ్‌కు ముందుంది ముసళ్ల పండగ
తమిళనాడులో ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. అనుకున్నది సాధించారు. మెజార్టీకి కాస్త సీట్లు తగ్గినా మద్దతు ఇచ్చేందుకు తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. సో.. విజయ్ ప్రభుత్వానికి ఐదేళ్లు డోకా లేదు.
చాలామంది నేతలు పలు సందర్భాల్లో చెబుతుంటారు. సీఎం పదవి అంటే ఆశామాషీ కాదు.. అదొక ముళ్ల కంచె లాంటిదని చెబుతారు. అధికారం అనుభవించడానికి బాగానే ఉంటుంది.. తేడా వస్తే నెట్టిన పెట్టుకున్న ప్రజలు కిందకు దించేస్తారు. ప్రస్తుతం కాబోయే సీఎం విజయ్‌కు అలాంటి సమస్యల తోరణం దర్శనమిస్తోంది.
హామీలకు ఆయన పదవీకాలం ముగుస్తుందా?
ఎందుకు టీవీకే పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చూస్తుంటే సాధ్యం అవుతుందా? అంటూ అప్పుడే తమిళనాడులో చర్చ మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టోలో 40 అంశాలు ప్రధానంగా ప్రస్తావించింది ఆ పార్టీ. అందులో కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతీ నెలకు 2500 రూపాయల ఆర్థికసాయం ప్రధాన అంశం.
రెండోది వధువు పెళ్లికానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర కూడా ఇస్తామని చెప్పారు. వృద్ధులు-వికలాంగులకు నెలకు 3000 రూపాయల పింఛన్, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4 వేల రూపాయలు,డిప్లొమా హోల్డర్లకు 2,500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసింది.
పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇవ్వనున్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు.
33 ఏళ్ల నాటి దావూద్ కుట్ర.. ఆయుధాల స్మగ్లింగ్ కేసులో 12 మందికి శిక్ష!
ఐదు ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ వంటి సమస్యలు కాబోయే సీఎంకు స్వాగతం ఇవ్వనున్నాయి. నాలుగైదు దశాబ్దాలుగా ద్రవిడ దిగ్గజ పార్టీలు రాజకీయాలు చేయడమేకాదు.. హామీల అస్త్రాలన్ని ప్రజల మనస్సులోకి చొప్పించారు. ఇచ్చిన హామీల నుంచి విజయ్ ఎలా బయటపడతారో చూడాలి.
మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తామని కీలకమైన హామీ ఇచ్చింది. 75 శాతం మంది స్థానికులను నియమించుకునే కంపెనీలకు 2.5 శాతం జీఎస్టీ రాయితీతోపాటు విద్యుత్ ఛార్జీలపై 5 శాతం రిబేటు ఇస్తామని తెలిపింది. ఇవికాకుండా ఇంకా చాలానే ఉన్నాయి.

