Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Godavari Janu : 'గోదావరి ' జాను రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Godavari Janu : 'గోదావరి ' జాను రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Big TV Live 1 month ago

Godavari Janu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తుంది. ఈ మధ్య చాలా సీరియల్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి.

పాత సీరియల్స్ ఉన్నా కూడా కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తుంది స్టార్ మా అలాంటి కొత్త సీరియల్స్లలో గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ విలేజ్ స్టోరీతో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన జాహ్నవి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె బ్యా గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆతృత కనబరుస్తున్నారు.. మరి ఈమె రియల్ లైఫ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జాహ్నవి రియల్ లైఫ్ లో కష్టాలు..

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ గోదావరి రోజురోజుకీ జనాల ఆదరణలో పొందుతూ మంచి రేటింగ్ని నమోదు చేసుకుంటుంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన స్టోరీ తో ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్గా నటించిన జాహ్నవి గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు తెగ వెతికేస్తున్నారు. గూగుల్లో ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. జాహ్నవి అసలు పేరు అనుమిత దత్త. గతంలో ఈమె అనేక సీరియల్స్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈమె రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించిన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అనుకోని పరిస్థితులలో చదువుని వదిలేసి నటన వైపు అడుగులు వేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబ పరిస్థితులు కారణంగానే ఆమె ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్లు అనుమిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. తన ఎమోషనల్ స్టోరీ ని ఇంటర్వ్యూలో బయటపెట్టి అందరిని ఏడిపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది.

Also Read :Podarillu Today Episode : పెద్దోడికి పెళ్ళాం దొరికేసిందోచ్..చక్రీని ఇరికించేసిన ప్రతాప్.. మహా నిజం చెప్తుందా..?

ఒక్కరోజుకు ఈమె రెమ్యూనరేషన్..?

జాహ్నవి అలియాస్ అనుమిత దత్త తెలుగు అమ్మాయి కాదు. ఈమె బెంగాల్ కు చెందిన ముద్దుగుమ్మ.. 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిధున పాత్రలో నటించింది. తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది కానీ ఈమె నిజానికి బెంగాలీ అమ్మాయి. బెంగాలీ భాషలో పలు సీరియల్స్లలో నటించిన ఈమె తెలుగులో నటించడం మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఆ సీరియల్ తర్వాత ఇప్పుడు నటిస్తున్న సీరియల్ కి రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు గాను దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే ఈ లెక్కన చూస్తే ఈమెయిల్ లక్షలు లోనే నెలకు సీరియల్స్ ద్వారా సంపాదిస్తుంది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live