Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big TV Live 6 days ago

Gold Price Today: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లోపాటు బులియన్ మార్కెట్లు పతనమవుతున్నాయి.

ముఖ్యంగా పెట్టుబడుదారులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ధరలు పతనమవుతున్నాయి. బంగారం-వెండి కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం మొదలైంది. గడిచిన రెండురోజులుగా బంగారం -వెండి ధరలుగా భారీగా పతనమవుతున్నాయి.

అమరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధం ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడుతున్నాయి. దీనికి ప్రభావం బంగారం-వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన రెండు రోజులుగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పతనమయ్యాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు సుమారు106 డాలర్లు పడిపోయి 4323 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 3.20 శాతం పడి 64 డాలర్ల స్థాయికి తగ్గింది.

పతనం అవుతున్న బంగారం-వెండి ధరలు

సెప్టెంబర్ 2న హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం- వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. గడిచిన మూడో రోజుల్లో ఊహించని విధంగా బంగారం రేటు దిగివచ్చింది. తులం బంగారం ధర రూ.6000 మేర పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లోని బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజు 24 క్యారెట్ల పసిడి రేటు రూ.2680 మేరా దిగొచ్చింది. 10 గ్రాములకు రూ.1,54,090 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి రేటు ఇవాళ రూ.2450 మేర పడి, తులం ధర రూ.1,41,250 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

కొనుగోలుదారుల్లో ఉత్సాహం, ఇంకా దిగొస్తుందంటూ..

వెండి ధర గురించి చెప్పనక్కర్లేదు. కిలో ఏకంగా రూ.10 వేలు దిగొచ్చింది. ప్రస్తుతం రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. ధరలు ఈ విధంగా దిగిరావడంతో సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం జరిగినంత కాలం బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అంటున్నారు.

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

మెట్రోనగరాల ధరలను ఒక్కసారి చూద్దాం. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,54,230 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,390 వద్ద కొనసాగుతోంది. ఇక, ముంబై, కోల్‌కతా, బెంగుళూరు, కేరళ, పూణెలో ఇదే విధంగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం నాలుగు నుంచి ఆరువందలు పెరిగింది. ఇవన్నీ ఉదయం 7 గంటలకు సంబంధించినవి మాత్రమే. మార్కెట్ తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live