Gundeninda Gudigantalu Balu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులకు డబ్బు మీద ఆశ ఉంటే ఎలా మారతారు అన్నది ఈ సీరియల్ స్టోరీ..
పెద్ద కొడుకు మాత్రమే తనకి నోట్లు తెచ్చి పెడతాడు అని భావించే ఒక తల్లి కొడుకు వల్ల పడే ఇబ్బందులు ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. మొదటినుంచి తనకు ఏ మాత్రం ఇష్టం లేని క్యారెక్టర్ లో బాలు నటిస్తుంటాడు. కొన్ని అనుకుని కారణాలవల్ల జైలుకు వెళ్లడంతో బాలు పై ద్వేషాన్ని పెంచుకుంటుంది అతని తల్లి ప్రభావతి. అయితే ఈ సీరియల్ లో ప్రభావతి బాలుల సీన్లు మాత్రం హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. సీరియల్ లో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కనిపించే బాలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? బాలు కి సొంత తమ్ముడు కూడా ఉన్నాడా అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బాలు ఇంట తీవ్ర విషాదం..
గుండెకి నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు పాత్రలో నటిస్తున్నాడు తమిళ నటుడు విష్ణుకాంత్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడైన సరే తెలుగు ప్రేక్షకులు ఈయనకు నీరాజనం పలుకుతున్నారు. అతనికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవుతుంది. బాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఇంట్లో జరిగిన విషాద ఘటన గురించి బయట పెట్టారు. తన బాబాయ్ కొడుకు చనిపోవడం అందరిని కోలుకోలేని బాధలోకి నెట్టేసింది అని ఆయన చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వార్త మరోసారి హైలెట్ అయ్యింది. ఇక బాలు ఫ్యామిలీలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి వంటరిగానే ఉంటున్నాడు. బాలు కి గతంలో పెళ్లయిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు.
బాలు, శ్రీముఖి లవ్ ట్రాక్..
బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి షో కి ఈ మధ్య ఈ సీరియల్ హీరో బాలు వస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి షోలలో బాలు ఎక్కువగా పాల్గొంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ కూడా ఏదో ఉంది అన్నట్లుగానే ఉంటుంది. నిజంగానే యాంకర్ శ్రీముఖి బాలుని ప్రేమిస్తుందా? బాలు కూడా ఆమెను ప్రేమిస్తున్నాడా అన్న అనుమానాలు కూడా చాలామందికి వచ్చే ఉంటాయి. నిజానికి బాలు శ్రీముఖి ల మధ్య అలాంటి బంధం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలు బయటపెట్టారు. కేవలం షోను హైలెట్ చేయడానికి మాత్రమే ఇద్దరు అలా స్క్రిప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే బాలు ఇప్పటివరకు రెండవ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయనకు పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పారు. మరి ఇక ముందు ఆయన ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.. బాలు కెరియర్ విషయానికొస్తే.. ప్రస్తుతం స్టార్ మా లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా.. జెమినీ టీవీలో మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు..

