Dailyhunt
Gundeninda Gudigantalu Mounika : 'గుండెనిండా గుడిగంటలు ' మౌనిక సంపాదన ఎంతో తెలుసా..?

Gundeninda Gudigantalu Mounika : 'గుండెనిండా గుడిగంటలు ' మౌనిక సంపాదన ఎంతో తెలుసా..?

Big TV Live 1 month ago

Gundeninda Gudigantalu Mounika : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మధ్యతరగతి కుటుంబంలోని మనుషులకు డబ్బు ఆశ కలిగితే వాళ్ల జీవితాలు ఎలా మారిపోతాయి అన్నది ఈ సీరియల్ స్టోరీలో చక్కగా చూపించారు. సీరియల్ కి బాలు మీనా హైలెట్ గా నిలుస్తారు. అయితే బాలు మీనాలతో పాటుగా మౌనిక క్యారెక్టర్ కూడా ఇందులో హైలెట్గా నిలుస్తుంది. సత్యం ప్రభావతీలా ఒక్కదాని ఒక కూతురు మౌనిక. డబ్బున్న ఇంటికి కూతురిని కోడలుగా పంపించాలని ఆశపడుతుంది. తన తల్లి ఆశే తన జీవితాన్ని నాశనం చేస్తుందని గ్రహించలేక పోతుంది మౌనిక. ఈ పాత్రలో జ్యోతి గౌడ నటించింది. అయితే ఈమె ఇప్పటికే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె సంపాదన గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

మౌనిక నెలకు అంత సంపాదిస్తుందా..?

గుండెనిండా గుడి గంటలు సీరియల్ లో మౌనిక అసలు పేరు జ్యోతి గౌడ.. ఒక కన్నడ నటి అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈమె కన్నడలో పలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం గుండు నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. కన్నడ అమ్మాయిలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కూడా ఇక్కడ డిమాండ్ ఎక్కువగానే ఉంది. సీరియల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది.. అయితే ఈమె నెలకు ఒక సీరియల్ కి దాదాపు పది లక్షలకు పైగా సంపాదిస్తుందని సమాచారం.. ప్రస్తుతం ఈమె మూడు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. అంటే దాదాపు 30 లక్షలకు పైగా ఈమె నెలకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే మౌనిక అంత సంపాదిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మౌనిక నిజం ఏంటో చెప్తే కానీ తెలీదు. దీనిపై ఆమె రియాక్ట్ అవుతుంది ఏమో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: భాగ్యంకు బడిత పూజ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాకిచ్చిన ధీరజ్.. ప్రేమకు సర్ప్రైజ్..

జ్యోతి గౌడ సీరియల్స్ విషయానికొస్తే..

ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్లను మించి సీరియల్లో నటించే ముద్దుగుమ్మలు అందంగా రెడీ అవుతూ వస్తున్నారు.. సోషల్ మీడియాలో వీళ్ళకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొట్టేలా చేస్తున్నారు. ముందు నిండా గుడి గంటలు సీరియల్ లోని మౌనిక కూడా అంతే.. సీరియల్ లో అత్యంత అమాయకమైన పాత్రలో కనిపించే జ్యోతి గౌడ ట్రెండీ లుక్ ఇట్లుంటుంది. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించిన జ్యోతి గౌడ తెలుగులో ప్రస్తుతం మూడు సీరియల్స్లలో నటిస్తుంది.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఇకపోతే ఈటీవీలో మరో సీరియల్ లో నటిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live