Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda Gudigantalu Rohini : అయ్యో.. రోహిణి ఇక కనిపించదా..? అప్పుడే ట్విస్ట్ ఇచ్చారుగా..

Gundeninda Gudigantalu Rohini : అయ్యో.. రోహిణి ఇక కనిపించదా..? అప్పుడే ట్విస్ట్ ఇచ్చారుగా..

Big TV Live 2 weeks ago

Gundeninda Gudigantalu Rohini : స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి.

అలాంటి క్రేజ్ ఉన్న సీరియల్స్ అలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది.. హీరో హీరోయిన్ అయిన , బాలు మీనలు తమ నటనతో జనాలని ఆకట్టుకున్నారు.. అయితే ఇందులో మలేషియా నుంచి వచ్చిన రిచ్ కోడలు పాత్రలో రోహిణి నటించింది.. రోహిణి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. ఈమె గురించి తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రోహిణి అతి త్వరలోనే సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమైతే ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాలి..

సీరియల్ నుంచి రోహిణి అవుట్..

గుండు నిండా గుడి గంటలు సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ లోని కొన్ని షార్ట్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా అటెండ్ అవుతున్నాయి. అయితే మీనా శృతి పాత్రలపై జనాలు ప్రశంసలు కురిపిస్తుంటారు. తన స్వార్ధాన్ని చూసుకుంటున్నా రోహిణి క్యారెక్టర్ పై ఎప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. తాను తన భర్త మాత్రమే బాగుండాలి అని అనుకునే ఈమె క్యారెక్టర్ నువ్వు లేపేస్తే బాగుండు అని జనాలు అనుకునేవారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందని తెలుస్తుంది. ఈ సీరియల్ నుంచి రోహిణి తప్పుకోబోతుందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. కారణం ఏంటో తెలీదు గానీ త్వరలోనే ఈమె దీనికి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలు పై క్లారిటీ రావాలి అంటే రోహిణి అలియాస్ జ్యోతి రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read : 'గోదావరి ' జాను రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

రోహిణి పాత్రలో మరో కొత్త క్యారెక్టర్..

ఈ సీరియల్లో అందరి పాత్రలు హైలెట్గా నిలిస్తే జనాలకు విసుగు పుట్టిస్తున్న క్యారెక్టర్ రోహిణి అని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు తన మలేషియా బండారం బయటపడుతుంది అని జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ రోహిణి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోనవసరం లేదు. ప్రభావతి గురించి అందరికీ తెలిసిందే కదా.. రోహిణి యవ్వారం గనక బయటకు వస్తే తన కాపురం దారిన పడడం మాట అటు ఉంచితే.. అసలు రోహిణి ఇంట్లో ఉంచుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో ఆల్రెడీ ఒక నటి నటించి వెళ్ళిపోయింది. అవి పాత్రలో జ్యోతి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఈ పాత్రలోకి మరో నటి రాబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే రోహిణి పాత్రలోకి రాబోతున్న కొత్త హీరోయిన్ ఎవరు అన్నది తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఏది ఏమైనా కూడా రోహిణి క్యారెక్టర్ ఇప్పుడు కనిపించదు అని అంటుంటే జనాలు కాస్త ఫీలవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live