Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Big TV Live 1 day ago

Gundeninda Gudigantalu : స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ లోకి కొత్తగా ఎంతమంది వచ్చినా సరే బాలు మీనా అలా క్యారెక్టర్ల ముందు వాళ్లంతా తేలిపోతారు.

అయితే ఇటీవల కాలంలో ఈ సీరియల్ లోకి చాలామంది కొత్త యాక్టర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ లోకి వచ్చిన ఎంతమంది క్యారెక్టర్ అయినా సరే హీరో హీరోయిన్ల ముందు పెద్దగా హైలెట్ అవ్వకుండా వస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ని దించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తుంది.. నిజంగానే ఈ సీరియల్ లోకి కొత్త యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నారా..? లేదంటే గతంలో అనేకసార్లు కొత్త హీరో రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి కదా ఇప్పుడు కూడా అలానే గాలి వార్తలేనా? నిజంగానే కొత్త వాళ్ళు ఎంట్రీస్తే ఎవరు సీరియల్ లోకి రాబోతున్నారు అంటూ జనాలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సీరియల్ లోని హీరో బాలు ఓ ప్రముఖ యూట్యూబర్ తో కనిపించడంతో ఆ వార్తలు కాస్త ఊపొందుకున్నాయి. మరి ఆ క్యారెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు కాస్త వివరాలు తెలుసుకుందాం..

యూట్యూబర్ షణ్ముఖ్ ఎంట్రీ..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు తాజాగా ప్రముఖ యూట్యూబ్ జస్వంత్ తో కలిసి ఓ వీడియోలో కనిపించాడు.. యూట్యూబర్ గా బాగా ఫేమస్ అయిన ఈ కుర్రాడు గతంలో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు సినిమా అవకాశాలతో పాటుగా ఆల్బమ్ సాంగ్స్ చేసే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి.. ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం కూడా తెలిసిందే.. తను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు తీసుకొని వెళ్ళాడు.. ప్రస్తుతం ఇతను వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారాడు. అయితే తాజాగా గుండెనిండా గుడి గంటలు హీరో బాలుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు షణ్ముఖ్.. దాంతో ఈ సీరియల్ లోకి ఇతను ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేదా బాలు తోనే ఏదైనా షణ్ముఖ కొత్తగా చేస్తున్నాడా అన్న ఆసక్తి నెలకొంది.. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఫోటో దిగారు అన్నది తెలియాల్సి ఉంది.

బాలు సీరియల్స్..

వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ కి మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళకి మంచి డిమాండ్ తో పాటుగా ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాలు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈయన తమిళంలో వరుసగా సీరియల్స్ చేసే తెలుగులోకి అడుగు పెట్టి ఇక్కడ కూడా రెండు సీరియస్లలో నటించే అవకాశాన్ని అందుకున్నాడు.. ఈ రెండు సీరియల్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో తర్వాత ఎలాంటి సీరియల్ స్టోరీ తో రాబోతున్నాడు అన్న ఆసక్తి జనాల్లో పెరుగుతుంది. బాలు అలియాస్ విష్ణు కాంత్ ఇటీవల సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నాడు.. అంతే కాదు ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న వీడియోలు కూడా బాగా వైరల్ అవ్వడంతో బాలు ఏం చేసినా క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. మరి యూట్యూబర్ యశ్వంత్ షణ్ముఖ్ తో కలిసి దిగిన ఫోటోల వెనక ఉన్న అర్థం ఏంటో తెలియాలి అంటే బాలు క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live