Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్. దొంగలను పట్టుకున్న బాలు.

Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్. దొంగలను పట్టుకున్న బాలు.

Big TV Live 2 weeks ago

Gundeninda GudiGantalu Today episode August 4th : రోహిణి అదే పెళ్లిలో మాణిక్యం ఉండడని చెప్పడానికి దగ్గర ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.. కానీ విద్య రోహిణికి చెప్పాలని ప్రయత్నించినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

మాణిక్యం కి చెప్పిన సరే ఏదో ఒకటి కాపాడవచ్చు అని అనుకుంటుంది… అయితే రోహిణి రెస్పాండ్ అవ్వడం లేదు కాబట్టి నేనే వెళ్లి నిజం చెప్పి దానిని కాపాడాలి లేదంటే తన్ని వాళ్ళు చంపేస్తారు అని వెళ్లబోతూ ఉంటుంది.. అప్పుడే మనోహర్ నుంచి ఫోన్ వస్తుంది.. మనోహర్ ప్రమాదంలో ఉన్నాడు అని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పడంతో విద్య కంగారు పడిపోతుంది.. ఇక ప్రభావతి మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది..

బాలు కోసం మీనా వెతుకులాట..

బాలు నిజంగానే తాగుతున్నాడేమో అని మేన కంగారు పడిపోతుంది నిజంగానే బాలు తాగితే మాత్రం అందరి ముందర పరువు పోతుంది అని మీనా ఆలోచిస్తూ ఉండగా.. బాలు కోసం వెతుకుతూ ఉంటుంది.. బాలు ఎక్కడ కనిపించలేదు తాగుబోతులతో కలిసి తాగుతున్నాడా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఒకవేళ పెళ్లిలో కనుక బాలు తాగుతూ ఉంటే అందరి దగ్గర పరువు పోతుంది అని మీనా కంగారు పడిపోతూ అంత వెతుకుతూ ఉంటుంది.. నిజంగానే బాలు తాగుతున్నాడో లేదో ఎట్టాగైనా తెలుసుకోవాలి అని మీనా కోపంగా ఫంక్షన్ హాల్ అంతా వెతుకుతూ ఉంటుంది ఒకచోట తాగుబోతు నుండి ఢీకొన్న బాలు కనిపించడంతో మీనా నిజంగానే తాగుతున్నాడేమో అని బ్రమ పడుతుంది పొరపాటు పడుతుంది. ఈయన అందరూ అన్నట్లుగానే నిజమైన తాగుతున్నాడు అని అనుకుంటుంది. ఇక పాలు దగ్గరికి వెళ్లి తాగుతూ బిజీగా ఉన్నారా అని అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.

బాలు పై అనుమానం..

ఇక రవి ఇద్దరు కలిసి బాలుని వెతికే పనిలో ఉంటారు బాలు ఎంత నిజం చెప్పినా కూడా మీనా వాళ్ళు అస్సలు నమ్మరు. నువ్వు తాగకుండా ఎలా ఉంటావు కచ్చితంగా తాగే ఉంటావులే అని బాలు పై మీనా అనుమాన పడుతుంది.. కానీ మీనా నమ్మదు. నువ్వు తాగలేదని నేనెలా నమ్మాలి నువ్వు తాగడం నేను చూశాను ఆవకాయ కూడా నంచుకోవడం నేను చూసాను అని మీనా ఎంతైనా బాలు మాట వినకుండా ఉంటుంది. ఇక బాలు తాగుబోతుల కోసం ఎంత వెతికినా కూడా కనిపించరు. మీరు వాళ్ళ ముందు తాగడం వల్లే వాళ్ల దగ్గర మందు అయిపోయిందేమో అని బాలు అంటాడు. చివరికి బాలు తన నిజాయితీ తనని నిరూపించుకుంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి చెక్ చేయమని మీనా దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇక అందులో తాగలేదు అని రావడంతో రవి మీనా నిజంగానే తాగలేదా అని అనుకుంటారు.

మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

అసలు నామీద నీకు అనుమానం ఎందుకు వచ్చింది మీనా అని బాలు అడుగుతాడు. మీ అమ్మను మీ అన్నయ్య ఇద్దరు కలిసి మీరు తాగుతున్నారని చెప్పగానే నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా..? ఇక మనోజ్ చెప్పాడు అని అనగానే మనోజ్ దగ్గరికి వెళ్లి బాలు ఒక ఆట ఆడుకుంటాడు. మనోజ్ రోహిణిని తిడతాడు. రోహిణి బాలు మీనాని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. మేమిద్దరం విడిపోతామని నువ్వు శాపం పెట్టు మేము నిజంగానే విడిపోతాం ఏమో చూస్తాము అని రోహిణి కావాలని బాలుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అయితే నేనెప్పుడూ ఒకరు విడిపోవాలని కోరుకోను అని బాలు అంటాడు. ఇక మనోజ్ రోహిణి అతనికి వెళ్ళిపోతారు.

మీనా, బాలు పెద్ద సాహసం..

మీ నాకు దొంగలు గుద్దుకోవడంతో మీరు ఎందుకు అంత హడావిడితో వెళ్తున్నారు అని అనుమానం మొదలవుతుంది. బాలు రావడంతో వాళ్ళు ఏదో హడావిడిగా వెళ్తున్నారండి వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు వాళ్ళని ఎలా ఆపాలి అని నేను అడుగుతుంది. ఇక బాలుకి కూడా వాళ్ళ ప్రవర్తన పై అనుమానం రావడంతో వాళ్లని ఆపే ప్రయత్నం చేస్తాడు.. తెలియడంతో అందరూ ముందర వాళ్ళని దారుణంగా కొడతాడు నగలని తీసుకుపోకుండా చేసినందుకు మీనా బాలు పై రంగ ప్రశంసలు కురిస్తాడు.. ఎపిసోడ్ కు ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుంది. బాలు మీనాల సాహసం అందరిని ఆకట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live