Gundeninda GudiGantalu Today episode May 3rd: ప్రభావతి సోఫాలో కూర్చుని కాలి మీద కాలు వేసుకుని పని వాళ్ళకి ఆర్డర్ చేసినట్టుగా మీనాన్ని ఇలా రా అని అంటుంది..
ఫ్రిజ్లో పాలు ఉంటాయి వెళ్లి కాఫీ పెట్టుకోరా అని అంటుంది. ఈ ఇంటి ఓనర్ చేయాల్సిన పని నా భార్య ఎందుకు చేయాలి అని బాలు అంటాడు.. నేను కాఫీ పెడతాను. కానీ ఎవరు తాగలేరు అని అనగానే మీనా నేను పెడతాను అని అంటుంది. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి అని ప్రభావతి అంటుంది. నీ పెళ్ళాం ఏదన్నా కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చిందా పూల అమ్ముకునే ఇంటి నుంచే కదా వచ్చింది ఇలాంటివన్నీ మామూలే కదా అని అంటుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మీ అమ్మ కళ్ళు నెత్తినెక్కి ఉన్నాయి. నువ్వేం పట్టించుకోకు రాని సత్యం అంటాడు.. అతనికి బాలు కూడా ప్రభావతి గాలి తీసేస్తాడు.
మనోజ్ పెద్ద ప్లానింగే..
ఇంత పెద్ద ఇంటికి ఒక పేరు పెట్టాలి కదరా ఏ పేరు పెడతావు అని ప్రభావతి అడుగుతుంది. చిన్నచితక పేర్లు కాదమ్మా న్యూమరాలజీని అడిగి మరీ ఇంటికి పేరు పెడతాను అని మనోజ్ అంటాడు. ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఇప్పుడు రాబోతున్నాడు. నేను ఆల్రెడీ అతనికి చెప్పాను అని చెప్పగానే మనోజ్ ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు అని ప్రభావతి గాల్లో మెడలు కట్టేస్తూ ఉంటుంది.. ఇప్పుడు అయినందుకు అని బాలు అడుగుతాడు. సంఖ్యాబలం ప్రకారం ఆయన ఇంటికి ఒక పేరు పెడతాడు ఆ పేరు నే మనం ఇంటికి పెట్టుకుందాం ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అని మనోజ్ అంటాడు.
కామాక్షి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
మనోజ్ కాకపోతే నీ ఇల్లు ఇదేనా అని కామాక్షి చాలా సంతోషంగా అక్కడికి వస్తుంది. ఆ ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వామ్మో ఎంత పెద్ద ఇంటిని మనోజ్ గాడు కొంటున్నాడు అని అనుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటి ఇదే ఇండ్ల మనోజ్ మింగబోతుంది అని కామాక్షి వెటకారంగా మాట్లాడుతుంది. సరిగ్గా చెప్పావు అత్త ఇదే ఇల్లు అని బాలు కూడా అంటాడు.. అదే మనోజ్ కన్నబోతు నేను లేనా అనేసి కామాక్షి అడగగానే ప్రభావతి అవును కామాక్షి ఇదే ఇల్లు చాలా పెద్దగుంది కదా అని అంటుంది. అవును ఇంట్లో ఏమైనా కుక్కలు ఉన్నాయా మీరందరూ బయట ఉన్నారు అని కామాక్షి అడుగుతుంది. అదేం లేదు ఎవరో గొప్ప జ్యోతిష్యుడు రాబోతున్నాడంట ఆయన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని ప్రభావతి అంటుంది.
ఇదేం ట్విస్ట్ రా..
మణికంఠ గురువుగారు వచ్చేసారు అని చాలా ఆత్రుతగా డోర్ తీయడానికి అని అక్కడికి వెళ్తాడు. అయితే డోర్ తీసే ముందు మణికంఠ నెంబర్లు చెప్పగానే అతను బయటికి వస్తాడు. అది చూసిన వీళ్లంతా కూడా ఏం జరుగుతుంది అని ఒక్క సారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రభావతి ఈయనేనా గొప్ప జ్యోతిష్యుడు అని అడుగుతుంది. ఆయన లోపలికి రాగానే బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు. ఈయన కోసమేనా మనం ఇంతసేపు వెయిట్ చేసింది అని బాలు అంటాడు. మీరు డోర్ దిగు గాని నెంబర్లు చెప్పగానే బయటకు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటండి అని బాలు అడుగుతాడు. అది ఒక సంఖ్య బలం గురించి చెప్పడం నాకు అలానే అలవాటు అని తన ఫ్యామిలీ స్టోరీ అని చెప్తాడు..
20 వేల ఫీజు అనగానే షాక్..
తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెప్పిన గురూజీ లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ గాలి తీసేస్తాడు. ఇక రోహిణి కూడా అడ్డంగా ఇరుక్కుని ఎలా కనిపిస్తుంది. మొత్తానికి తర్జనభజన పడి ఆ ఇంటి పేరు రోమతి అని చెప్తాడు. రోమతి ఏంటి శాంతి నిలయం అని పెడితే బాగుంటుంది కదా అని సత్యం అంటాడు. స్వామీజీకి తెలిసినంతగా మీకు తెలుసా మీరు ఆగండి కాసేపు అని ప్రభావతి అంటుంది. రోమతి ఏం బాగుంది రోజ్ నిలయం అని పెడితే ఇంకా బాగుంటుంది కదా అని కామాక్షి అంటుంది. మొత్తానికి ఈ ఇద్దరూ కాసేపు కామెడీగా అందరిని నవ్వించేస్తారు. రోమతి అనే పేరు ఫిక్స్ చేసుకోండి అని అతను కచ్చితంగా చెప్తాడు ఇక 20,000 ఫీజు అనగానే అందరూ నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తారు. ఏంటి 20,000 ఫీజా అని బాలు కూడా షాక్ అవుతాడు. ఇక మనోజ్ ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. మొత్తానికి ఇంటి పేరు కూడా పెట్టేసామని చాలా సంతోషంగా ఉంటారు మనోజ్. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో మనోజ్ నిండా మునిగాడని తెలుసుకుంటాడా లేదా అన్నది చూడాలి…

