Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda GudiGantalu Today episode: మౌనిక కోసం ఎదురుచూపులు.. శివను అవమానించిన ప్రభా.. ప్రభకు మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: మౌనిక కోసం ఎదురుచూపులు.. శివను అవమానించిన ప్రభా.. ప్రభకు మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Big TV Live 1 week ago

Gundeninda GudiGantalu Today episode September 1st : బాలు ఈరోజు ఏం పండగో తెలియదా అని అందర్నీ అడుగుతాడు.. ఏం పండగ ఇవాళ అని బాలుని అందరూ అడుగుతారు.

కానీ ప్రభావతి కూడా ఆ పండగ గురించి తెలీదు ఏంటో చెప్పు అని అంటాడు.. ఇదంతా ఎందుకురా అసలు ఇవాళ ఏ పండగ చెప్పు అని ప్రభావతి అడుగుతుంది.. వాళ్ళ రాఖీ పండుగ అన్న సంగతి ఎవరికీ తెలియదా అని బాలు అందరినీ ఒకసారి కడిగి పడేస్తాడు. అసలు ఈ పండగ రోజు మనము మౌనిక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మౌనిక వస్తుంది అని కాసేపు ఎదురు చూద్దామని బాలు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు.. బాలు ఎంత ఎదురు చూసినా కూడా మౌనిక రాదని ప్రభావతి అనడంతో అందరూ కూడా ప్రభావతి మీద పడిపోతారు.. కానీ సత్యం మాత్రం ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి అందరూ కూడా రాఖీ కట్టించుకున్న తర్వాతే వెళ్లాలి అని కండిషన్ పెడతాడు. ఆ మాట విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్న చెప్పినట్లే వినాలి అని వాళ్ళ పనులను ఆపుకొని మరి మౌనిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

మౌనిక కోసం బాలు వెయిటింగ్..

మౌనిక వస్తుంది అని బాలు తో సహా ఇంట్లోని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. రాఖీ కట్టించుకోవాలి అని బాలు కూడా చాలా ఆశ పడుతూ ఉంటాడు. అయితే మనోజ్ రవి లను కూడా బాలు ఆపి మౌనిక వస్తుంది అని వెయిట్ చేస్తాడు.. వచ్చేది అయితే ఎప్పుడో వచ్చేది కదా ఇప్పటికీ రాలేదు అంటే ఇంక రాదేమో అని ప్రభావతితో సహా ఇంట్లోని వాళ్ళందరూ చెబుతున్నా సరే అసలు వినకుండా బాలు మౌనిక వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే అని మొండిగా ఉంటాడు.. మనోజ్ మాత్రం తన బిజినెస్ అంతా లాస్ అయిపోయింది అని వెయిట్ చేస్తూ ఉంటే నా జీవితం మొత్తం ఇక్కడే అయిపోతుంది అంటూ తొందరపడిపోతూ ఉంటాడు. ఆ మాట విన్న బాలు మనోజ్ నీ సెటైర్లతో కౌంటర్లు వేస్తూ ఉంటాడు..

శివను అవమానించిన ప్రభావతి..

మౌనిక ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉండగా శివ ఇంటికి వస్తాడు. శివ ఇంటికి రాగానే ప్రభావతి తనని చూసి వెటకారంగా మాట్లాడుతూనే అవమానిస్తుంది.. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అని నేను అడుగుతుంది. నువ్వు రాలేదు కదా అక్క రాఖీ కట్టించుకోవడానికి నేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే.. మంచి పని చేసావ్ రా నీ బాలు అంటాడు కానీ ప్రభావతి మాత్రం ఇక్కడికి వచ్చి తగలడాలా అని అంటుంది.. నేనే ఇంట్లో పని అయిన తర్వాత వచ్చి రాఖీ కడతామని అనుకున్నాను రా ఇవాళ పని ఎక్కువైంది అందుకే రాలేకపోయాను సరే అని మీనా అంటుంది. రాఖీ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది మీనా కానీ ప్రభావతి మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. మొత్తానికి మీనా తన తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తుంది.. శివ రాఖీ కట్టిన తర్వాత మీనా కి ఒక రూపాయి ఇవ్వగానే ప్రభావతి అంతకన్నా ఎక్కువ ఇస్తాడని అస్సలు అనుకోలేను అని శివని దారుణంగా అవమానిస్తుంది.. మాకు రూపాయి అయినా సరే చాలా విలువైంది మేము రూపాయి చూడట్లేదు మా మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తున్నామని మీనా అంటుంది..

ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

ప్రభావతి శివ డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు దాచుకో అని మీనా అని అంటుంది.. అయితే మీనా మాత్రం ఆ డబ్బులు నేను ఎక్కడ దాచుకుంటాను.. అవసరమైతే బ్యాంకు లాకర్లు కూడా దాచుకుంటాను నీకెందుకు అని ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ ఇస్తుంది. కానీ శివ ఎంతగా ప్రభావతి ముందు తలవంచి ఉన్నా కూడా తను మాత్రం అవమానిస్తూనే ఉంటుంది.. ఈరోజు తోడుగా ఉంటాడు కానీ రేపు పెళ్లయిన తర్వాత అదే మాట అంటాడా అని ప్రభావతి కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ మాట విన్న బాలు ఇప్పుడే వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా అని అంటాడు. ప్రభావతి ఎంత చెప్తున్నా సరే నోరు మూసుకొని ఉండకుండా వాళ్ళిద్దర్నీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇక శివా నేను వెళ్తాను అక్క అని అక్కడి నుంచి వచ్చేస్తాడు..

మౌనిక దగ్గరకు వెళ్లిన అన్నలు..

మౌనిక ఇంకా రాలేదు ఇవాళ నా బిజినెస్ అంతా పోయింది అంటూ మనోజ్ చిందులు వేస్తూ ఉంటాడు.. మౌనిక ఎప్పుడొస్తుందో తెలిస్తే అంతవరకు వెయిట్ చేస్తాము అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినకుండా మొండిగా ఉండాల్సిందే అని అంటాడు.. మీరు ఇక్కడ వెయిట్ చేయడం కంటే మౌనిక దగ్గరికి వెళ్లి కట్టించుకోవడం బెటర్ కదా అని మీనా అనగానే ముగ్గురు అన్నలు కూడా మౌనిక దగ్గరికి వెళ్లేందుకు రెడీ అవుతారు. ఇక ముగ్గురు అన్నలు వెళ్తూ ఉండగా సత్యం.. అది మౌనిక వాళ్ళ ఇల్లు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అంటూ బాలుకి చెప్తాడు. అయితే అక్కడ ఏ గొడవ పెట్టుకోకుండా రాకే కట్టించుకొని మౌనంగా రావాలి అని చెప్పగానే బాలు సరే నాన్న అని వెళ్ళిపోతాడు.. మౌనిక వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live