Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు కౌంటర్స్ అదుర్స్.. సుమతి పెళ్లి ఫిక్స్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు కౌంటర్స్ అదుర్స్.. సుమతి పెళ్లి ఫిక్స్..

Big TV Live 2 weeks ago

Gundeninda GudiGantalu Today episode August 27th : మీనా ఇంకా రాలేదు కనీసం టీ పెట్టే దిక్కు కూడా లేదు అంటూ శృతి బాలు రవి ముగ్గురు కూడా తనకోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

అప్పుడే మనోజ్ ఇంట్లోకి రావడం చూసినా ప్రభావతి ఆ మంత్రగత్తే షోరూం కి వచ్చిందా అని అడుగుతుంది. కానీ రాలేదు అని మనోజ్ చెప్పగానే ప్రభావతి మాత్రం రోహిణి పై అనుమానంతో మళ్లీ మళ్లీ అడగడంతో బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. ఇక ప్రభావతిని బాలుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడే లోపలికి వచ్చిన రోహిణిని చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ రోహిణి మాత్రం బ్యాగ్ లోంచి డబ్బులు తీసి ఇస్తుంది. ప్రభావతికి కాస్త అనుమానం మొదలైన సరే రోహిణి మాట విని ఆగిపోతుంది..

రోహిణి ప్లాన్ సక్సెస్..

బాలు టీ పెట్టమని అడిగితే నేను మీకు టీ పెట్టాలా ఏం మాట్లాడుతున్నావ్ రా కొంచమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అడుగుతుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ ఇంటికి రావడం చూసిన ప్రభావతి ఏంట్రా ఆ మాయలాడి కూడా ఈరోజు షో రూమ్ కి వచ్చిందా అని అడుగుతుంది. రాలేదమ్మా నేనొక్కడినే వచ్చాను అని చెప్పగానే నిజంగానే అంటున్నావా లేకపోతే దాని ఉచ్చులో పడిపోయావా అని మళ్ళీ మళ్ళీ ప్రభావతి అడుగుతుంది. అప్పుడే రోహిణి ఇంట్లోకి రావడం చూసి ఎక్కడికి వెళ్లావే ఇంతసేపు ఏం చేసావు అని ప్రభావతి అడుగుతుంది. అయితే రోహిణి ఇంట్లోకి రావడంతోనే ప్రభావతికి డబ్బులు ఇవ్వాలని చూస్తుంది. ఇక బాలు అస్సలు ఆగకుండా రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు వేస్తూనే ఉంటాడు..

ప్రభావతిని రెచ్చగొట్టిన బాలు..

ఈ డబ్బులు ఎందుకు నాకెందుకు ఇస్తున్నావు అని ప్రభావతి అడుగుతుంది. నా తప్పు నేను తెలుసుకున్నాను అత్తయ్య అందుకే ఇకమీదట మళ్లీ తప్పు చేయకూడదని అనుకుంటున్నాను ఈ డబ్బులను కూడా మీకు అందుకే ఇస్తున్నాను అని అంటుంది. కానీ రోహిణి అన్నమాట ప్రభావతికి పెద్దగా నచ్చకపోవడంతో నీ డబ్బులు వద్దు ఏమీ వద్దు అని ఎంత చెప్పినా సరే వినకుండా డబ్బులు తీసుకోండి మీ తర్వాతే నాకు ఏవైనా అంటూ మరో మాయ నాటకాలను మొదలు పెడుతుంది. ఆ తర్వాత బాలు రోహిణి మీద అసలు ఆగకుండా సెటైర్లు వేస్తూనే ఉంటాడు. రోహిణి నిజంగానే డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది అంటే నిన్ను డబ్బులతో నోరు మూయించాలని అనుకుంటుందేమో అని బాలు కౌంటర్లు వేయడంతో రోహిణి షాక్ అవుతూనే ఉంటుంది. ప్రభావతి వద్దంటున్న సరే.. మిగిలిన వాళ్ళు ఎంత చెప్పినా సరే అసలు వినకుండా రోహిణి తీసుకోండి అని బలవంతం చేయడంతో మనోజ్ కూడా తీసుకో అమ్మ తను చేసిన మోసంలో ఇదేమి పెద్దది కాదు అని అంటాడు.. రోహిణి డబ్బులను తీసుకున్న తర్వాత అమ్మయా నా మీద కాస్త కోపం తగ్గుతుంది అని మనసులో అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా బాలు మాత్రం కౌంటర్ అని వదలకుండా వేస్తూనే ఉంటాడు.

మీనాను అవమానించిన ప్రభా..

మీనా ను ప్రభావతి అవమానిస్తుంది.. రోహిణి నాకు 20,000 తీసుకుని వస్తే నువ్వేంటి చాక్లెట్లు పట్టుకుని వచ్చావు అని గోరంగా మాట్లాడుతుంది.. ఈరోజు మా తమ్ముడు ఎగ్జామ్ బాగా రాశాడు. ఫైనల్ ఎగ్జామ్ ఇది ఎగ్జామ్ లో పాస్ అయితే వాడు కచ్చితంగా ఉద్యోగంలో చేరతాడు అని మీనా చాలా సంతోషంగా అందరికీ చాక్లెట్ తీసుకుని వస్తుంది. కానీ ప్రభావతి మాత్రం చీప్ గా చాక్లెట్లు తీసుకొని వచ్చావా అంటూ ఒక్క మాటతో తన పరువు ని అడ్డంగా తీసేస్తుంది.. కానీ సత్యం వాళ్ళందరూ కూడా శివ మంచిగా పాసయ్యి ఉద్యోగం తెచ్చుకుంటాడు. మీ అమ్మని సుమతిని బాగా చూసుకుంటాడు అని మెచ్చుకోవడంతో బాలు ఒక కుటుంబంలో వ్యక్తిని ఎదగాలని కోరుకోవడం ఇలా అని చెప్తాడు. ఇక బాలు చేసిన పనికి మీనా తనకోసం పాలు తీసుకొని వస్తుంది ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటారు.

సుమతి పై పార్వతికి అనుమానం..

సుమతి ఉదయం లేచిన తర్వాత తన తల్లిని తీసుకొని అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడిన తీరు. పార్వతి అరుణ్ కి కృతజ్ఞతలు కూడా తెలుపుతుంది. పార్వతీ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోవద్దు అని అరుణ్తో అనడంతో నేనేమి చేయలేదండి నా డ్యూటీ నేను చేశాను అని అంటాడు.. సుమతి మీ గురించి చెప్పింది బాబు మీరు నిజంగా లేకపోతే నా కొడుకు వచ్చే వాడే కాదు అంటూ పార్వతి తనకి కృతజ్ఞతలు తెలుపుతుంది.. ఇక అరుణ్ వాళ్ళ అమ్మ సుమతి పై కేర్ తీసుకోవడంతో పార్వతికి అనుమానం వస్తుంది.. ఇక మీ నాకు మళ్ళీ కొత్త కాంట్రాక్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా చింతామణిని ఓడించి తను నెంబర్ వన్ గా నిలబడాలి అని అనుకుంటుంది.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live