Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడేలా ఉందంటే..?

గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడేలా ఉందంటే..?

Big TV Live 3 days ago

Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ను రానించాలి అంటే కచ్చితంగా ఆమె అందంగా ఉండాలి.. నాజుకు అందాలతో కుర్రాలను ఆకట్టుకునే విధంగా ఉన్న హీరోయిన్లకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి.

ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్లు ఈమధ్య సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కొందరు ముద్దుగుమ్మలు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు.. అప్పట్లో స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్లలో ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఒకరు. ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఆది మూవీలో అతనికి జోడిగా నటించింది కీర్తి చావ్లా.. అప్పట్లో సన్నగా అందంగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది. ఏం చేస్తుంది? అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్..

సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే మంచి టాక్ ని సొంతం చేస్తుంది. అయితే కథలు ఎంపిక విషయంలో ఆమె సరైన మెలకువలు పాటించకపోవడంతోని ఇండస్ట్రీకి అతి తక్కువ కాలంలోనే దూరమైంది.. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఈమె ఓ ఫంక్షన్ కి హాజరైనట్లు సమాచారం. సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఎన్టీఆర్ హీరోయిన్ ను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్లు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. అలా ఈమె కూడా ట్రెండ్ అవుతుంది.

Also Read :Podarillu Today Episode : మహా నాది.. భూషణ్ కు చక్రీ వార్నింగ్..చక్రీకి ప్రతాప్ ఛాలెంజ్.. ఇదే ట్విస్ట్..

కీర్తి చావ్లా సినిమాల విషయానికొస్తే…

హీరోయిన్ కీర్తి చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఆది సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్అవ్వడంతో.. కీర్తికి మళ్ళీ బ్రేక్ రాలేదు.. ఆ తర్వాత పలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలలో నటించింది. అయితే ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.. ప్రస్తుతం చూడ్డానికి కీర్తీ చావ్లా కాస్త బొద్దుగా అయ్యింది. అయితే ఇప్పటికీ కీర్తి చావ్లా పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కీర్తి చావ్లా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈమె లేటెస్ట్ లుక్ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live