Nikhil Siddarth : తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బిజీగా మారిన హీరోలు ఈమధ్య అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా వాళ్లకి మంచి క్రేజ్ ని సంపాదించి పెడుతున్నాయి.
అలాంటి స్టార్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఈయన కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేసే తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.. కార్తికేయ సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరోగా మారిన ఈ నిఖిల్ ఈమధ్య ఈయన నుంచి సినిమాలు రాలేదు. కార్తికేయ 2 తర్వాత స్వయంభు సినిమాలో నటిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఆ మూవీ ఇప్పటివరకు షూటింగ్ అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు.
దాంతో ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో మొన్నటి వరకు ప్రచారంలో ఉన్నాయి. సినిమా గురించి అప్డేట్ రావడంతో సినిమా షూటింగు పూర్తికావస్తుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈ మూవీ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిఖిల్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
హాలివుడ్ స్టూడియోతో నిఖిల్..
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం కానున్నారని తెలుస్తుంది. ప్రముఖ గ్లోబల్ సంస్థ ఆయన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ తో నిఖిల్ చేతులు కలిపినట్లు ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిఖిల్ 'కార్తికేయ 2' చిత్రంతో బ్లాక్‌బస్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఓ భారీ ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యం కావడంతో నిఖిల్ అభిమానులకు ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఆ ప్రాజెక్టులో నిఖిల్ ను ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీని గురించి అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మే 15న ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..
స్వయంభు షూటింగ్ అప్డేట్..
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకేక్కుతుంది. క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్‌లు, అద్భుతమైన పీరియడ్ వార్ సీక్వెన్స్‌లతో కూడిన మూవీ నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే మూవీ గురించి మరో అప్డేట్ రానున్నట్లు సమాచారం..

