Dailyhunt
హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!

హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!

Big TV Live 1 week ago

Cricket Row: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ (టీసీఏ) హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) మధ్య వార్​ ముదురుతోంది. ఓ వైపు హెచ్సీఏ టీజీ20 పేర ప్రీమియర్​ లీగ్​ పోటీలను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తుండగా దీనిని తక్షణమే నిలిపి వేయాలని టీసీఏ డిమాండ్ చేస్తోంది.

ఈ మేరకు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి బీసీసీఐకి ఓ అలర్ట్ నోటీస్​ పంపించారు. వెంటనే స్పందించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నో ఆరోపణలు..

హెచ్​సీఏపై పలు అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్​ బాళ్లు కొనటం మొదలుకుని ఉప్పల్​ స్టేడియంలో ఏర్పాటు చేయించిన బకెట్​ కుర్చీల వరకు ప్రతీ దాంట్లో హెచ్సీఏలో సభ్యులుగా ఉన్న కొందరు భారీగా అవినీతికి పాల్పడినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హెచ్​సీఏ అధ్యక్షునిగా పని చేసి జగన్మోహన్​ రావుతోపాటు పలువురిని అరెస్ట్​ చేశారు. తాజాగా హెచ్​సీఏ అక్రమాలపై అదనపు పోలీస్​ కమిషనర్ స్థాయి అధికారి ఇన్​ ఛార్జ్​ గా 'సిట్' ఏర్పాటు చేసి విచారణ జరిపించాలంటూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

హోరెత్తిన కేరళ వీధులు.. రాజకీయ వైరం మరిచి.. ఒక్కటైన ప్రత్యర్థి పార్టీలు!

ఇటువంటి పరిస్థితుల్లో..

ఇటువంటి పరిస్థితుల్లో హెచ్​సీఏ టీజీ 20 ప్రీమియర్​ పోటీలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీని కోసం గవర్నింగ్​ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. దీనిపై టీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో క్రికెట్​ ను అభివృద్ధి చేయటానికే ఈ పోటీలు అని చెబుతున్న హెచ్​సీఏ మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని చెబుతోంది. రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ను అభివృద్ధి చేయాలంటే జిల్లా స్థాయి కమిటీలు, మౌళిక సదుపాయాలు, క్రికెటర్ల నెట్​ వర్క్​ తప్పనిసరి అని పేర్కొంది. ఈ నెట్​ వర్క్​ హెచ్​సీఏకు లేదని స్పష్టం చేస్తోంది. ఈ కారణంగానే గత 80ఏళ్లుగా హెచ్​సీఏ జిల్లాల స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏమీ చేయలదని అంటోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నెట్​ వర్క్​ ఉండి పునాది స్థాయిలో క్రికెట్​ వ్యవస్థను నడుపుతున్నది కేవలం టీసీఏ మాత్రమే అని చెబుతోంది.

నిబంధనలకు విరుద్ధం..

ఇటువంటి పరిస్థితుల్లో టీసీఏతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా హెచ్​సీఏ టీజీ 20 ప్రీమియర్​ లీగ్ ను ప్రకటించటం, ఫ్రాంచైజీల కోసం ఈఓఐ ప్రక్రియను ప్రారంభించటం, గవర్నింగ్ కౌన్సిల్​ ను ప్రకటించటం బీసీసీఐ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధమని టీసీఏ చెబుతోంది. ముంబయి హైకోర్టులో తుది తీర్పు పెండింగ్ లో ఉన్న సమయంలో హెచ్​సీఏ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొంది. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్​ 28, 30, 31 ప్రకారం బీసీసీఐ ముందస్తు అనుమతి లేకుండా టోర్నమెంట్​ నిర్వహించటం చట్ట విరుద్ధమని తెలిపింది. ఐపీఎల్ టోర్నీకి 15రోజుల ముందు 15రోజుల తరువాత ఉండే బఫర్​ పీరియడ్​ లో స్టేట్​ లీగ్స్​ నిర్వహించరాదన్న నిబంధనను కూడా హెచ్సీఏ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అనుమతి లేని ఇలాంటి టోర్నీల్లో పాల్గొంటే క్రికెటర్లు, కోచ్​ లు, అంపైర్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గత పన్నెండేళ్లుగా టీసీఏ రాష్ట్రంలోని జిల్లాల్లో అభివృద్ధి చేసిన గ్రాస్​ రూట్ క్రికెట్ వ్యవస్థను అక్రమంగా హస్తగతం చేసుకోవటానికే హెచ్​సీఏ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. దీనిని అడ్డుకోవటానికి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live