Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్యకు ఝలక్..ముంబై జట్టులో గందరగోళం !

హర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్యకు ఝలక్..ముంబై జట్టులో గందరగోళం !

Big TV Live 2 weeks ago

Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ప్రారంభానికి దాదాపు 10 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ ఆడుతున్న 10 ఫ్రాంచైజీలు ప్లేయర్లను మార్చే పనిలోపడ్డాయి.

గత సీజన్ లో విఫలమైన ఆటగాళ్లను జట్టులో భారంగా మారిన మరికొంత మంది ప్లేయర్లను వదిలించుకునే పనిలో పడ్డాయి. 10 ఫ్రాంచైజీలు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ లిస్టులో మొదటి వరుసలో ఉందని చెప్పవచ్చు. ఆ జట్టులో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలించుకునే పనిలో పడ్డట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ ఇలా చాలా టీమ్స్ నుంచి ఆఫర్లు వచ్చాయని జోరుగా చర్చలు మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ ను హార్దిక్ పాండ్యా పెడతాడని వస్తున్న వార్తల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యాను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధంగా లేనట్లు ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు

ముంబై ఇండియన్స్ జట్టు… 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను వదిలి వేయకుండా.. జట్టులోనే కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసిందట ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ కాకుండా సాధారణ ప్లేయర్ గా అవకాశం ఇచ్చేందుకు అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంటలోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమర్శలు

అదే సమయంలో ఐపిఎల్ సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం డిసైడ్ అయిందని అంటున్నారు. టి20 కెప్టెన్ గా అతడు పనికిరాడని బీసీసీఐ…. నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అదే బాటలో ముంబై ఇండియన్స్ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ను పక్కకు పెట్టి.. తిలక్ వర్మ లేదా యార్కర్ల కింగ్ బుమ్రాకు అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మహేలా జయవర్థనే నీకు హెడ్ కోచ్ పదవి

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా మహేలా జయవర్థనే (Mahela Jayawardene) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యాను అటు మహేలా జయవర్థనే పక్కకు పెట్టి కొత్త వాళ్లను తీసుకునే ప్రయత్నం మొదట్లో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. కానీ ఈ రెండు నిర్ణయాలను వెనక్కి తీసుకొని… హార్థిక్ పాండ్యాను జట్టులోనే కొనసాగించేందుకు డిసైడ్ అయింది అంటున్నారు. అటు మహేలా జయవర్థనే 2027 ఐపీఎల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా కొనసాగబోతున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live