Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

Big TV Live 5 days ago

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతులు సాధించడమే ప్రధాన ఎజెండాగా ఆయన ఈ పర్యటనను చేపట్టారు.

ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్ ఘన స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రులతో ముఖ్యమైన సమావేశాలు

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నందున, సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలోనే కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 10:30 గంటలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమవుతారు. తర్వాత ఉదయం 11:30 గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అవుతారు.

సాగునీటి ప్రాజెక్టుల అనుమతులే ప్రధాన ఎజెండా

ఇటీవల సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు సమర్పించి, ప్రాజెక్టుల పురోగతికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ

కేంద్ర మంత్రులతో భేటీల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live