Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HBD Trisha: త్రిష మెచ్చిన హీరో, హీరోయిన్ ఎవరంటే?

HBD Trisha: త్రిష మెచ్చిన హీరో, హీరోయిన్ ఎవరంటే?

Big TV Live 3 weeks ago

HBD Trisha:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష.. భాషతో సంబంధం లేకుండా నేడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది.

ఇకపోతే ఈరోజు తన 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి త్రిష ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరు?..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు..

చెన్నై మహా నగరంలో కృష్ణన్ – ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈమె..1999లో మిస్ చెన్నై పోటీలో విన్నర్ గా నిలిచి తానేంటో నిరూపించింది. అలా అదే ఏడాదిలో జోడి అనే తమిళ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అందులో హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకి కూడా సరైన గుర్తింపు లభించింది. అలా మొదటి సినిమాతోనే పేరు దక్కించుకోవడంతో సూర్య పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. అలా తొలిసారి ‘మౌనం పేసియాదే’ అని చిత్రంలో హీరోయిన్ గా తొలిసారి నటించిన ఈమె.. అక్కడి నుంచి “నీ మనసు నాకు తెలుసు” సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

త్రిషకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ వీళ్ళే..

ఇకపోతే 2004లో ప్రభాస్ తో వర్షం సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఈ ఒక్క సినిమాతో తన కెరీర్నే మార్చేసుకుంది. ఇక తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, కృష్ణ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. స్టార్ డంను పట్టించుకోనని చెప్పింది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి నటిగా కెరియర్ ఆరంభించి ఇన్నేళ్లు అవుతున్నా.. అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే సూర్య కరుప్పు సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తనకు కమలహాసన్, వెంకటేష్, అమీర్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పిన ఈమె.. సిమ్రాన్, ఏంజెలినా జోలి అంటే చాలా ఇష్టం అని తెలిపింది. మొత్తానికి అయితే తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

మిల్కీ బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందా.. కొత్త కొటేషన్ తో ఆసక్తికర చర్చ!

సంతోషంలో త్రిష..

ఇదిలా ఉండగా తన స్నేహితుడిగా , స్టార్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి టీవీకే పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే నేడు తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో త్రిష సంతోషంలో ఉప్పొంగిపోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live