Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిజ్రాలపై సంచలన కామెంట్స్ చేసిన అరియానా గ్లోరి.. వీడియో వైరల్..!

హిజ్రాలపై సంచలన కామెంట్స్ చేసిన అరియానా గ్లోరి.. వీడియో వైరల్..!

Big TV Live 6 days ago

Ariyana Glory:ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చలాకీతనంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె..

ముఖ్యంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇంటర్వ్యూతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే అరియానా.. తాజాగా హిజ్రాల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీరి వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ యాంకర్ రవి (Anchor Ravi) కొత్తగా ప్రారంభించిన పాడ్ కాస్ట్ స్టూడియో ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లిన ఈమె.. ఆ సందర్భంలో తాను చూసిన, గతంలో అనుభవించిన కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తూ మండిపడింది.

హిజ్రాలపై అరియానా ఆగ్రహం..

ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు నిర్మించుకోవడం. ఆ ఇంటిని నిర్మించుకోవడానికి ఎంతో కాలం కష్టపడి, రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఒక కలల సౌధాన్ని నిర్మించుకుంటారు. లేదా ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాంటి పవిత్రమైన సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి చేసే హంగామా మనశ్శాంతిని దూరం చేస్తోంది. మేము ఒక సొంత ఇంటి గృహప్రవేశం చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని నేను ఎదుర్కొన్నాను.

లక్షల్లో డబ్బు డిమాండ్..

గృహప్రవేశం చేస్తున్న సమయంలో పూజ జరుగుతుండగా వచ్చి ఆటంకం కలిగించారు. అలా ఆటంకం కలిగించడమే కాకుండా వేలల్లో కాదు కాదు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం.. ఇంటి గుమ్మం పై నంబర్లు వేసి వెళ్లడం.. ఇప్పుడు ఇవ్వకపోతే మా వాళ్ళు వస్తారు.. అంటూ అప్పుల వాళ్ళ లాగా ఇంటి మీద కొచ్చి ఒత్తిడి తీసుకురావడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇల్లుని.. ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఎంతో సంతోషంతో ఆ వేడుకను జరుపుకుంటాము. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య జరిగే ఆ వేడుక వేళ.. ఇలాంటి బలవంతపు వసూళ్లు మంచి వాతావరణాన్ని కూడా నెగిటివ్ గా మార్చేస్తాయి. ముఖ్యంగా ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే సంతోషంగా ఇవ్వాలి కానీ ఇలా డిమాండ్లు చేసి లాక్కోవడం సరైనదేనా? అంటూ ఆమె ప్రశ్నించింది.

కష్టపడి బ్రతకడానికి ఎన్నో మార్గాలు..

సమాజంలో కష్టపడి గౌరవంగా జీవించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇతరుల బలహీనతలను లేదా శుభకార్యాల సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెట్టడం ఆపాలి. నిజానికి నేను ఎవరిని కించపరచడం కానీ నొప్పించడం కానీ చేయడం లేదు. ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది ఈ విషయాన్ని ధైర్యంగా బయటకి చెప్పలేకపోతున్నారు. కొంతమంది వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ప్రత్యేకించి కొంతమంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మేము కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నాము అంటూ నెటిజన్స్ కూడా ఈమె మాటలకు మద్దతు పలుకుతున్నారు.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live