Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరో విజయ్ కారు నెంబర్ వెనుక ఉన్న రహస్యం అదేనా?

హీరో విజయ్ కారు నెంబర్ వెనుక ఉన్న రహస్యం అదేనా?

Big TV Live 1 month ago

Vijay Thalapathy: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న హీరో విజయ్ టీవీకే అనే పార్టీని స్థాపించిన 14 నెలల్లోనే ఏకంగా అధికారంలోకి రాబోతుండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2024లో పార్టీ స్థాపిస్తే 2026లో ఎన్నికల బరిలోది ఏకంగా 108 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు విజయ్.. ముఖ్యంగా స్వతంత్ర పార్టీగా ప్రజల ముందుకు వచ్చిన ఈ టీవీకే ఇప్పుడు అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆయన కారు నెంబర్. ముఖ్యంగా ఆయన తాను ఉపయోగించే కార్లన్నింటికీ కూడా 0277 అనే ప్రత్యేక నెంబర్ను వాడుతూ ఉంటాడు. దీంతో ఎందుకు విజయ్ తన కారులన్నింటికీ ఈ నంబర్నే ఉపయోగిస్తున్నాడు? ఆయనకు ఈ నెంబర్ ఏదైనా సెంటిమెంటా? లేక లక్కీ నంబరా? అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. ఈ నెంబర్ వెనుక అసలు రహస్యం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

చెల్లి మరణం.. విజయ్ లో ఊహించని మార్పు..

విజయ్ దళపతికి చెల్లి విద్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎన్నో సందర్భాలలో తన చెల్లి గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు.. 1977 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించిన విద్య కొంత అనారోగ్య కారణంగా 1984 మే 21వ తేదీన మరణించింది. ముఖ్యంగా విజయ్ తండ్రి ఎస్.సీ. చంద్రశేఖర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్య తన అన్నయ్య విజయ్ చేతుల్లోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన విజయ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. విద్య మరణించక ముందు విజయ్ చాలా చురుకుగా , అల్లరి చేస్తూ, చురుగ్గా ఉండేవారు. కానీ విద్య మరణం విజయ్ ను పూర్తిగా మార్చేసింది. అంతర్ముఖుడిగా మారిపోయారు విజయ్.

చెల్లి లేని లోటును అలా తీర్చుకుంటున్న విజయ్..

ఇక ఇదే విషయాన్ని ఒకానొక సందర్భంలో విజయ్ మాట్లాడుతూ..” నా చెల్లెలు విద్య మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టంగా మారింది. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు నాకు ఎంతోమంది చెల్లెళ్లను అభిమానుల రూపంలో ఇచ్చాడు. వారందరిలో నా చెల్లెలు రూపాన్ని చూసుకుంటున్నాను” అంటూ తెలిపారు. ఇకపోతే తన చెల్లెల్ని మరువలేక తన కూతురికి దివ్య అని నామకరణం చేశారు విజయ్.

కార్ నెంబర్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇకపోతే తన చెల్లి పైన ఉన్న ఇష్టంతోనే తన కార్ నెంబర్ ని కూడా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకే 0277అనే ప్రత్యేక నెంబర్ ను వాడుతుంటాడు. ఈ నెంబర్ విద్య పుట్టిన తేదీ తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికే ఆ నంబర్ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదులపరుచుకున్నారు. మొత్తానికైతే చెల్లి మరణించి దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆమెను నిత్యం గుర్తు చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు విజయ్ . ఇక ప్రస్తుతం విజయ్ కార్ నంబర్ ప్లేట్ వెనుక ఉన్న అసలు రహస్యం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

also read:రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం!

ఆ అనుబంధం విజయ్ కి మాత్రమే సాధ్యం..

తమకంటూ ఒక కుటుంబం ఏర్పడితే తల్లిదండ్రులనే దూరంపెట్టే అన్నలను ఎంతోమందిని చూసాము. అలాంటిది చెల్లి చనిపోయి దశాబ్దాలు అవుతున్నా ఇంకా ఆమె జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ఒక్క విజయ్ కే చెల్లింది అనే కామెంట్లు నెటిజన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live