Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్..  పవన్ భాష తీరు సరిగా లేదు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big TV Live 5 days ago

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అధికార-విపక్షాలకు చెందిన నేతలు రియాక్ట్ అవుతూన ఉన్నారు.

తాజాగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మనసులోని మాటలను చిట్ చాట్ రూపంలో బయటపెట్టారు.

గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్

జూన్ రెండున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ పెట్టడం సరైన సమయం కాదని అన్నారు. ఓ వైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే పవన్ సభ ఏంటన్నది ఆయన మాట. అంతేకాదు మీడియా సమావేశంలో ఆయన భాష తీరు సరిగా లేదన్నారు. కూటమి నేతలు అమరావతిని బ్రహ్మoడమైన రాజధాని అంటున్నారని గుర్తు చేశారు.

అక్కడే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నివాసం ఉండాలన్నారు. తెలంగాణ కన్నా ఏపీలో నేచురల్ అవకాశాలున్నాయని వెల్లడించారు. అక్కడ సముద్ర తీరం ఉందని, రకరకాల పోర్టులున్నాయి వివరించారు. ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణ వైపు చూడొద్దన్నారు.

పవన్ భాష తీరుపై కీలక వ్యాఖ్యలు

అంతేకాదు పరస్పర దూషణలు సరైంది కాదని, తెలంగాణ లో విద్వేషాలు పెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. అదే సమయంలో తెలంగాణలోని రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. తెలంగాణలో 75 శాతం ధాన్యం సేకరణ పూర్తి అయ్యిందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సహకరించలేదని, అందువల్లే కొంత ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. వరి-పత్తి తప్ప ఏ పంటలు పండించడం లేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live