Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు అవుట్..

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు అవుట్..

Big TV Live 1 week ago

Illu Illaalu Pillalu Ramaraju : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. సీరియల్లో రామరాజు పాత్ర హైలెట్గా నిలుస్తుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయనే ఈ సీరియల్ కి కీలక మలుపుగా మారతాడు. అనాధగా పుట్టిన అతను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా తన కుటుంబాన్ని తనతోనే ఉండాలన్న చిన్న ఆశతో ఉంటాడు.. ఆ కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టిన శ్రీవల్లి పచ్చడి సంసారాన్ని ముక్కలు చేయాలి అని అనుకుంటుంది. తన పెత్తనం కోసం ప్రాణాలను కూడా తీసేలా తను ప్లాన్లు చేస్తూ ఉంటుంది.. కానీ రామరాజు మాత్రం తన పెద్ద కోడలే తనకు దేవత అని భావిస్తూ ఉంటాడు. రామరాజు ఏం చెప్పినా కూడా తన పెద్ద కోడలు చేసినట్లుగా ఎవ్వరూ చేయలేరు అంటూ తెగ పొగిడేస్తూ ఉంటాడు. అది ఆసరాగా తీసుకుని శ్రీవల్లి ఆ ఇంట్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తూ వస్తుంది.. ఈ సీరియల్ కి బ్యాక్ బోన్ గా ఉన్నారు రామరాజు ఇప్పుడు కనిపించడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే రామరాజు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడా? లేదా నిజంగానే సీరియల్ లో క్యారెక్టర్ అని లేపేసారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

రామరాజు అవుట్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ స్టోరీ కాస్త వీక్ గా ఉన్నా కూడా ప్రేక్షకులను అంతో ఎంతో ఆకట్టుకుంటునే వస్తుంది. ఇందులో రామరాజు పాత్ర హైలెట్గా నిలుస్తుంది.. అందరూ ఆయనకు కాస్త భయపడుతూ ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు అని అనుకుంటారు. ప్రస్తుతం రామరాజు ఈ సీరియల్ లో కనిపించలేదు.. ధాన్యం కొనడానికి కానీ ఊరికి వెళ్ళిన రామరాజు గత నాలుగు రోజుల్లో ఎపిసోడ్ల నుంచి అసలు కనిపించలేదు. అయితే రామరాజు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి నిజంగానే రామరాజు క్యారెక్టర్ అని లేపేసారా లేదా అన్నది సీరియల్ యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ప్రేమ ధీరధులు విడిపోవడం ఈ స్టోరీకి పెద్ద మైనస్ అనే అనిపిస్తుంది. శ్రీవల్లి మాత్రం ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఎవరికి వాళ్ళని విడగొట్టాలి అని అనుకుంటుంది. నర్మద మాత్రం ప్రేమ ధీరజులని కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇక సాగరేమో రోజురోజుకీ లంచాలు తీసుకుంటూ తను ఇల్లు ఉండగానే దీపాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమూల్యను ఎలాగైనా సరే.. తన ప్రేమలో పడేలా చేయాలని అనుకుంటాడు. అమూల్య విశ్వం ఇద్దరు కూడా ప్రేమలో పడితే మళ్లీ ఆ రెండు కుటుంబాలు కలిసేలా ప్రయత్నాలు చేయొచ్చు అని విశ్వం అనుకుంటాడు.. మొత్తానికి ఈ సీరియల్ స్టోరీ ప్రస్తుతం గజిబిజిగా ఉండడంతో జనాలు ఎక్కువగా దీనిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి సీరియల్ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఇందులో ఏదైనా ట్విస్టులను డైరెక్టర్ తీసుకొస్తాడేమో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live