Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Big TV Live 2 months ago

Illu Illalu Pillalu Today Episode june 4th : భద్ర ధీరజ్ ని ఎలాగైనా ఇరికించాలి అని పక్కా ప్లాన్ ప్రకారం రెడీగా ఉంటుంది. ధీరజ్ ని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఎప్పుడెప్పుడు ధీరజ్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది.

తన మేనల్లుడికి జరిగిన అవమానం ధీరజ్ కి జరిగితే ఆ పనోడు చచ్చిపోతాడు అని సంతోషంగా ఉంటుంది. ఈరోజు ధీరజ్ని ఎలాగైనా సరే ఇరికించేసి వాడి పీడని వదిలించుకోవాలి అని భద్రవతి చేసిన ప్లాన్ మాత్రం సక్సెస్ అవుతుంది.

గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్…

ప్రేమ కోపంగా ఉండడంతో ధీరజ్ తనని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఒక అతను ఎదురుగా వస్తున్న ధీరజ్ కారిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే స్పీడ్ గా వస్తున్న కారు దగ్గరికి అతను పరిగెత్తుకుంటూ రావడంతో సడన్ గా బ్రేక్ చేస్తాడు.. ఏంటి ఇంకాస్త ఇంకా చచ్చేవాడికి తెలుసా ఇంత సడన్గా మధ్యలోకి వస్తావ్ ఏంటి కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని అడుగుతాడు.. కానీ అతను మాత్రం నేను పావుగంట నుంచి ఇక్కడికి వెళ్లే వెహికల్స్ అన్నిటిని ఆపుతున్నాను ఎవరు కూడా ఆపడం లేదు అని ధీరజ్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు . ఒక డెలివరీ బాయ్ ని ఒక ఇంట్లో అర్జెంటుగా ఈ బాక్స్ ని డెలివరీ చేయాలి లేదంటే నా ఉద్యోగం పోతుంది పెళ్ళాం పిల్లలు కలిగి ఉన్నారు అని అనగానే అతన్ని కారు ఎక్కమని చెప్తాడు..

ధీరజ్ కు అనుమానం..

మొదట బాక్స్ ని చూసిన ధీరజ్ అతను డిక్కీలో పెట్టడం చూసి అందులో ఏమున్నాయి అని అడుగుతాడు. ఏం లేదు సార్ ఇందులో మామిడి పండ్లు ఉన్నాయి అని చెప్పగానే.. కారులో ఈ బాక్సులు పెడుతున్నావు ఒకసారి చెక్ చేయాలి కదా ఓపెన్ చెయ్యి అని అనగానే అందులో మామిడి పండ్లు కనిపించడంతో దీరాజ్ నిజంగానే మామిడి పండ్లు అనుకొని గుడ్డిగా నమ్మేస్తాడు.. కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ పోలీసులు చెకప్ కోసమని కారుని ఆపుతారు.. ధీరజ్ కి అనుమానం వచ్చిన సరే అతని తప్పేమీ లేదు అన్నట్లుగానే అనుకుంటాడు..

డ్రగ్స్ తో దొరికిపోయిన ధీరజ్..

ధీరజ్ ప్రేమ వెళుతూ ఉండగా పోలీసులు కారుని ఆపుతారు.. మా ఆవిడని ఎస్సై కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను సార్ ఏమైంది చెప్పండి అని అడుగుతాడు ధీరజ్. అయితే మీ కారుని చెక్ చేయాలి అని పోలీసులు మొత్తం చెక్ చేయగా డిక్కీలో ఉన్న మామిడి పండ్ల బుట్టలలో డ్రగ్స్ కనిపిస్తాయి. మామిడి పండ్లు తినడానికి ఇదేమైనా ఉప్పు అనుకున్నావా డ్రగ్స్ ని అమ్ముతావా నువ్వు ఇలాంటి వాడివ పద పోలీస్ స్టేషన్ కి అని ధీరజ్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు పోలీస్.. ఇవి మావి కాదు సార్ అతను అర్జెంటుగా వెళ్లాలి అని అంటే నేను ఎక్కించుకున్నాను అతనివి అని అనగానే అతను అక్కడ లేకుండా పారిపోతాడు.. ఇక ధీరజ్ ఎంత చెప్పినా పోలీసులు మాత్రం మాట వినరు..

భద్ర, సేన ఫుల్ హ్యాపీ..

భద్రావతి అనుకున్న విధంగానే… పోలీసులు ధీరజ్ ని అరెస్ట్ చేయడంతో చాలా సంతోషంగా ఉంటుంది. జైల్లో వేసి పోలీసులు ధీరాజ్ని కొడుతుండగా ఆ వీడియోని చూసిన సేన భద్ర ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ధీరజ్ గాడు ఇప్పుడు ఇలా ఇరుక్కుంటాడని అస్సలు అనుకోలేదు అని భద్రసేనా హ్యాపీగా ఉంటారు. లోపలికి వచ్చిన ప్రేమ ధీరజ్ ఏ తప్పు చేయలేదు అని అంటుంది.. మీరు అతని కొట్టడానికి వీల్లేదు.. అని ప్రేమ ధీరస్ ని కొడుతూ ఉంటే ఆపుతుంది. ప్రేమ లోపలికి రావడం చూస్తున్న భద్ర నా మేనకోడలికి ఏమి కాకుండా ఉండాలి ముందు తనని బయటికి పంపించేసి వాడిని కుమ్మేసేయండి అని అంటుంది. ఇక భద్ర చెప్పినట్టే పోలీసులు ప్రేమని బయటకు లాక్కొని వచ్చి ధీరజ్ నీకు కొడతారు.

షాక్ లో నర్మద..

వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా రీల్స్ చేస్తూ ఉంటారు.. అయితే వల్లి డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉండాలని చూస్తున్నా నర్మదా నిజంగానే కడుపుతో ఉందా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని నేరుగా వల్లి దగ్గరికి వెళ్లి కనుకోవాలని అనగానే శ్రీవల్లి అయ్యో అడ్డంగా దొరికిపోయానే అని ఫీల్ అవుతుంది. ప్రేమ ఇంటికి రాలేదు ఏమైంది అని నర్మదా కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమకు ఫోన్ చేయగానే ప్రేమ ధీరజ్ అరెస్టు అయిన విషయాన్ని చెప్పగానే నర్మదా షాక్ అవుతుంది.. నర్మద టెన్షన్ పడుతూ రామరాజుకి ఈ విషయాన్ని చెప్పబోతోంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే రామరాజు కింద పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live