Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Today Episodes: కడుపుమంటతో రగిలిపోయిన వల్లి.. వేదవతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న సాగర్..

Illu Illalu Pillalu Today Episodes: కడుపుమంటతో రగిలిపోయిన వల్లి.. వేదవతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న సాగర్..

Big TV Live 1 month ago

Illu Illalu Pillalu Today Episode May 4th: విశ్వక్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని వచ్చేందుకు భద్రాసేన ఇద్దరు కూడా హైదరాబాద్కు వెళ్లి లాయర్ ని కలుస్తారు.

ఆ లాయరు మీ మేనల్లుడ్ని తప్పకుండా రిలీజ్ చేస్తాము అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ సంతోషంలో ఎలాగైనా సరే విశ్వక్ని తీసుకొని ఆ రామరాజు గాడికి పని పట్టాలి అని అనుకుంటుంది. మొత్తానికి అయితే బెస్ట్ లకు బయటికి రావడంతో భద్రాసేన ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. మరి అమూల్య పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బయటకొచ్చిన విశ్వక్ అమూల్యను ఊరికే ఉంచుతాడా..? ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

ప్రేమ దొరికిపోతుందా..?

ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన ధీరజ్ కు ప్రేమ అబద్ధం చెప్పింది అని గ్రహించలేక పోతాడు. తను ఎక్కడ దొరికిపోతాను అని చాలా జాగ్రత్తగా ఒక అబద్ధాన్ని ధీరజ్ కి చెప్తుంది. ఇక్కడ బ్యాంకు తప్ప మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ లేదు కదా మరి నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను అని చెప్పావు అసలు అమౌంట్ ఎక్కడ అని అడుగుతాడు. రేపు ఉదయం ఒకసారి కాల్ చేసి అడగమని అన్నారు. రేపు ఉదయం తీసుకుందాం లేరా పద వెళ్ళిపోదామని ధీరజ్తో ప్రేమ ఉంటుంది..

వల్లికి కడుపుమంట..

ఇంటికి రాగానే నర్మదా ఇద్దరు ప్రేమ పక్షులు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. మీకు మీ చెల్లెలు చెప్పలేదా వదిన అని ధీరజ్ కూడా వెటకారంగా మాట్లాడతాడు. దేని గురించి నాకు దేని గురించి చెప్పలేదే ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లారు అని నర్మదా మళ్లీ అడుగుతుంది. అదేంటి మీ చెల్లెలు మీకు చెప్పలేదు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అసలే మా అమ్మ మీ ఇద్దరికీ తోడు దొంగలు అని పేరు పెట్టింది అలాంటిది నువ్వు చెప్పకుండా వచ్చావు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ కనిపించడంతో శ్రీవల్లి నాకు కడుపు మండిపోతుంది వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే కదిలించాలి అని అనుకుంటుంది.

నర్మద, ప్రేమలను ఆడుకున్న వల్లి..

విల్లులా నవ్వుతూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. బెల్లు కొట్టాల్సిందే అని చేతిలో బెల్లు పట్టుకుని కొడుతుంది. అసలు ఈ బెల్ సౌండ్ ఏంటని ధీరజ్ అడుగుతాడు. మావయ్య గారు తనకి దగ్గరుండి అన్ని సేవలు చేయమని బెర్రీ ఇచ్చాడు.. కోతికి కొబ్బరి చెపు దొరికినట్లు ఆ బిల్లు పట్టుకొని తెగ కొట్టిస్తుంది అని ప్రేమ అంటుంది. ఏంటక్కా ఏం కావాలి అని ఇద్దరు వల్లి దగ్గరికి వెళ్లి అడుగుతారు.. నాకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కావాలి అని వల్లి అంటుంది. ఇక ఇద్దరూ కలిసి బజ్జీలను తెచ్చి మళ్ళీ చేతిలో పెడతారు. ప్రేమని బట్టలు ఉతకమని చెప్తుంది. నర్మదా ఇల్లంతా క్లీన్ చేసి అలసిపోతుంది..

వేదవతి దెబ్బకు దిమ్మతిరిగే షాక్..

అమ్మాయి ఇవన్నీ దెబ్బకి మనం భయపడి చేస్తున్నాము. నావల్ల కావట్లేదు అని ప్రేమ అంటుంది. మీతో ఆడుకుంటుంది అది మీరు గ్రహించలేకపోతున్నారు అని ధీరజ్ అంటాడు.. దీనికి ఒకటే మార్గం ఆరోగ్యంతోనే కొట్టాలి అని ధీరజ్ ఇచ్చిన సలహాతో ప్రేమ నర్మద ఇద్దరు కాకరకాయ జ్యూస్ చేసి వల్లికి ఇస్తారు. దాన్ని తాగను అని మొండికేసి కూర్చుంటుంది వల్లి. మధ్యలో వేదవతి ఎంట్రవడంతో ఇక తప్పక బలవంతంగా వల్లి చేత కాకరకాయ జ్యూస్ ని తాగిస్తారు. ఈ పెళ్లొద్దు ఏమి వద్దు నాకు వాంత వచ్చేలా ఉంది అని దాన్ని విసిరి కొట్టేస్తుంది వల్లి..

ఇంట్లోంచి వెళ్లిపోతున్న సాగర్..

బయట రోడ్డు మీద పనిచేస్తున్న సాగర్ దగ్గరికి ప్రసాద్ రావు వెళ్తాడు.. ఇంట్లో ఆస్తి పంపకాల గురించి ఏం మాట్లాడవు అసలు మీ నాన్న ఏమంటున్నాడు అని సాగర్ ని అడుగుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం చూసిన రామరాజు నాన్న చెయ్యి పట్టుకుని రైస్ మిల్లు కెళ్తే అవమానంగా భావించాడు.. ఇప్పుడు ఎర్రటి ఎండలో నిలబడి ఇలా ఉద్యోగం చేస్తున్నాడు అని అవమానించేలా రామరాజు మాట్లాడుతాడు. ఇక సాగర్ ఆయన దగ్గర అసలు ఉండకూడదు అని నిర్ణయించుకుంటాడు.. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా భోజనం చేస్తూ ఉంటే వేదవతి సాగర్ ఇంకా రాలేదు అని అరుస్తుంది. దాంతో సాగర్ బ్యాగ్ తో బయటికి రావడం చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే రామరాజు కూడా షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో సాగర్ నర్మదా ఇంట్లోంచి వెళ్లిపోతారా లేదా అన్నది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. రాజేశ్వరి దెబ్బకు షాక్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live