Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Today Episodes: తోడి కోడళ్ళను ఆడుకొనేందుకు వల్లి స్కెచ్.. అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. నర్మదకు అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: తోడి కోడళ్ళను ఆడుకొనేందుకు వల్లి స్కెచ్.. అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. నర్మదకు అనుమానం..

Big TV Live 2 months ago

Illu Illalu Pillalu Today Episode May 3rd: లాయర్ తో తన మేనల్లుడిని బయటికి తీసుకొచ్చేందుకు గొడవ పడుతూ ఉంటుంది భద్ర. ఇంత డబ్బు పలుకుబడి ఉండి కూడా నా మేనల్లుడ్ని బయటికి తీసుకు రాలేకపోతున్నాను అందుకే భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు వచ్చాను అని భద్రావతి లాయర్ తో అంటుంది.

మీరు నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చారు మీకోసం నేను ఏదో ఒకటి చేయాలి అని లాయరు రేపు సాయంత్రం లోపల మీ మేనల్లుడు మీ ఇంట్లో ఉంటాడు అని చెప్పగానే సేన భద్ర ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. లాయర్ దగ్గర నుంచి బయటికి రాగానే సేనకు బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి ప్రేమ నగలను తాకట్టు పెట్టబోతుంది అని చెప్తాడు. నగలను తాకట్టు పెట్టాల్సిన అవసరం ప్రేమకేమొచ్చింది ఆ తండ్రి కొడుకులని ఇద్దరినీ మనం కడిగి పడేయాలి అని భద్ర అనుకుంటుంది.

ప్రేమకు దిమ్మతిరిగే షాక్..

ధీరజ్ కి ఎలాగైనా సరే సాయం చేయాలి అని ప్రేమ తన నగలని తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వెళుతుంది. ఎవరికీ తెలియకుండా నగలం తాకట్టు పెట్టి ధీరజ్ కి డబ్బులు ఇవ్వాలని ప్రేమ ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ బ్యాంకుకు వెళ్లిన తర్వాత ప్రేమను గుర్తుపట్టిన మేనేజర్ నువ్వు భద్రావతి మేనకోడలు కదా అని అడుగుతారు. కోట్ల ఆస్తికి వారాసురాలివి.. నువ్వు ఇలా నగలు తాకట్టు పెట్టడం ఏంటి అని అడగగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లయింది వేరే ఇంటికి కోడల్ని నాకు పర్సనల్ థింగ్స్ చాలా ఉన్నాయి. అందుకే తాకట్టు పెడుతున్నాను అని ప్రేమ అంటుంది. కానీ బ్యాంకు మేనేజర్ మాత్రం ఈ విషయం ఎలాగైనా సరే భద్రావతికి చెప్పాలని అనుకుంటాడు.

మరో బాంబ్ పేల్చబోతున్న భద్ర..

బ్యాంక్ మేనేజర్ చెప్పిందని పట్టి భద్ర చాలా కోపంగా ఉంటుంది. ప్రేమ డబ్బుల కోసం ఇలా చేస్తుందా వాళ్ళిద్దరే ఇలా చేయించారు అని అనుకుంటుంది.. ఆ ధీరజ్ గాడే ప్రేమ నగలను తాకట్టు పెట్టమని చెప్పి ఉంటాడు అని భద్ర అనుకుంటుంది. వాళ్ళిద్దర్నీ అస్సలు వదిలితే లేదు ఇవాళ ఏదో ఒకటి తేల్చి పడేయాలి అని భద్ర సే నాతో అంటుంది. ఇక ప్రేమ ధీరజ్ కి తెలియకుండానే డబ్బును తెచ్చి వాళ్ళని అనుకుంటుంది. డబ్బులు కుదిరాయి రేప్ సాయంత్రం కల్లా నీ చేతిలో ఉంటాయి అని ప్రేమ చెప్పగానే ధీరజ్ చాలా సంతోషంగా ఉంటాడు. అంత పెద్ద అమౌంట్ నీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతారు. నా ఫ్రెండ్ ఇచ్చింది అని ప్రేమ ఏదో ఒకటి చెప్పి అబద్ధం చెప్తుంది.

ధీరజ్ కు అనుమానం..

ప్రేమని రిసీవ్ చేసుకోవడానికి బ్యాంక్ వర్క్ వెళ్ళినా ధీరజ్ కు ప్రేమ పై అనుమానం వస్తుంది. ఇక్కడ ఎక్కడ బ్యాంకు తప్ప ఏ ఇల్లు లేవు మరి మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఏంట్రా నువ్వు బ్యాంకు పక్కన ఏంటి పక్కనే ఉంటుంది చాలా దూరం వెళ్ళాలి అని ప్రేమ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. కానీ ధీరజ్ మాత్రం ఏదో డౌట్ కొడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ నీ అనుమానాలు ఆపేస్తే ఇంకా వెళ్ళిపోదామని ప్రేమ అంటుంది. ధీరజ్ ఫోన్ చేసి రమ్మనగానే ప్రేమ నగలని బ్యాగ్ ని కూడా అక్కడే వదిలేసి బయటికి వచ్చేస్తుంది. ప్రేమ చేసిన ఈ పొరపాటు రేపు అందరి ముందు దోషులగా నిలిచి పెట్టే పరిస్థితి వస్తుంది అని అర్థమవుతుంది.

వల్లి కడుపు పై నర్మదకు అనుమానం..

శ్రీవల్లి కడుపుతో ఉంది అని అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటుంది. అయితే శ్రీవల్లికే తెలియని నిజం ఏంటంటే తాను కడుపుతో లేదని. కడుపుతో ఉన్న వాళ్లకి వాంతులు వికారం అన్ని ఉంటాయి కదా మరి శ్రీవల్లి అక్కకి ఎందుకు లేవు అని నర్మదా అనుకుంటుంది. ఈ విషయం ఎలాగైనా సరే వేదవతి తో తేల్చుకోవాలని అనుకుంటుంది. మూడో నెల అంటే ఎవరికైనా వాంతులు వేళ్ళు ఉండి తినడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అని వల్లి యొక్క మాత్రం పీకల వరకు మెక్కుతుంది. నాకు ఏదో అనుమానంగా ఉంది అత్తయ్య అనేసి నర్మదా అనగానే వేదవతి నీ అనుమానాలు తగలెయ్య అలాగే కొంతమందికి ఉంటుందిలే అనేసి అంటుంది.

ధీరజ్ మళ్ళీ ఇరుక్కుంటాడా..?

విశ్వక్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని వచ్చేందుకు భద్రాసేన ఇద్దరు కూడా హైదరాబాద్కు వెళ్లి లాయర్ ని కలుస్తారు. ఆ లాయరు మీ మేనల్లుడ్ని తప్పకుండా రిలీజ్ చేస్తాము అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ సంతోషంలో ఎలాగైనా సరే విశ్వక్ని తీసుకొని ఆ రామరాజు గాడికి పని పట్టాలి అని అనుకుంటుంది. మొత్తానికి అయితే బెస్ట్ లకు బయటికి రావడంతో భద్రాసేన ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. మరి అమూల్య పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బయటకొచ్చిన విశ్వక్ అమూల్యను ఊరికే ఉంచుతాడా..? ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :డాక్టర్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. సీరియల్స్ కు గుడ్ బై..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live