Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Big TV Live 4 days ago

Illu Illalu Pillalu Today Episode August 5th :ధీరజ్ ప్రేమ కోసం అకాడమీలో వెయిట్ చేస్తూ ఉంటారు.. ప్రేమ ఈ రోజు స్పెషల్ క్లాస్ అని చెప్పినా కూడా ఇంకా రాలేదేంటి అని అందరు చూస్తూ ఉంటారు..

ప్రేమ రాగానే ధీరజ్ చాలా సంతోషంగా తనకోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు.. అయితే ప్రేమ మొదటగా ధీరజ్ ని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది.. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ఎవరో తెలియలేదు అన్నట్టుగానే వెళ్ళిపోతుంది.. ఇక ప్రేమ వెనకాలే వెళ్లిన ధీరజ్ కు ప్రేమ సెక్యూరిటీ దగ్గర ఇరిగించేస్తుంది.. ఎలాగైనా సరే ప్రేమతో మాట్లాడాలి అని వెనకాలే వెళ్ళిపోతాడు ధీరజ్.. అందరూ కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కూడా.. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కోపంగా ఉంటారు.. ఇక విశ్వం అమూల్యతో మాట్లాడాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య విశ్వామిని చూసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అమూల్య చెయ్యి పట్టుకుని లాగగానే అమూల్య చెంప పగలగొడుతుంది..

విశ్వం షాకిచ్చిన అమూల్య..

అమూల్య తో మాట్లాడాలని విశ్వం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అమూల్య కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు.. అమూల్య రాగానే ఎలాగైనా సరే తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు విశ్వం. కానీ విశ్వం చూసిన అమూల్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది.. కానీ విశ్వం మాత్రం అమూల్యతో మాట్లాడాలి నీతో పని ఉంది అని అంటాడు. దేని గురించి మాట్లాడాలి ఎందుకు నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావో కొంచమైనా బుద్ధి ఉందా నీకు ఉదయం మా అన్నయ్య చేత కొట్టించాను కదా అయినా కూడా నీకు బుద్ధి రాలేదా అని అమూల్య అంటుంది. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి నేను చెప్పేది కాస్త విను అమూల్య అని ఎంత చెప్తున్నా సరే అమూల్య మాత్రం వినకపోవడంతో విశ్వం మీ అన్నయ్య గురించి మా చెల్లెలు గురించి మాట్లాడాలి అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆగిపోయిన అమూల్య మా వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటుంది.

నువ్వు నా జోలికి వస్తే ఊరుకోను…

విశ్వం ఇంక తన జోలికొస్తే బాగోదు అని అమూల్య వార్నింగ్ ఇస్తుంది.. ఎంతగా చెప్పాలని ప్రయత్నించిన సరే విశ్వం మాత్రం అసలు వినకపోవడంతో మా వాళ్ల గురించి నాకు తెలుసు మా అన్నయ్య మా వదిన ను ఎలా కలుపుతాను తెలుసు. నువ్వు ఏమి ఇబ్బంది పడొద్దు నువ్వు ఏమీ బాధపడొద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకో అని అమూల్య అంటుంది.. అమూల్య మాట వినగానే విశ్వం ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే అమూల్య మాట విన్న విశ్వం ఎంతగా బతిమాలాడాలని ప్రయత్నించిన సరే.. తను మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అమూల్య ఇక వినదు అని విశ్వం బ్రతిమిలాడుకుంటాడు. కానీ ఇంకొకసారి నా వెంట పడితే మా ఇంట్లో వాళ్ళందరి చేత నేను కొట్టిస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అమూల్య..

ధీరజ్ తాగేసి రచ్చ..

ధీరజ్ తాగేసి రచ్చ రచ్చ చేస్తాడు.. తిరుపతి తో సహా కూర్చొని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే ఏంటి అల్లుడు నువ్వు ఇవాళ చాలా కొత్తగా మొత్తం తాగేస్తున్నావు. ఎప్పుడు చిన్న పిల్లోడిలాగా కొంచెం కొంచెం తాగే వాడివి కదా అని అడుగుతాడు. ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు ఏమైంది అని తిరుపతి ఒకవైపు అడుగుతున్న సరే ధీరజ్ మాత్రం ప్రేమ చేసిన అవమానం తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు.. సెక్యూరిటీ ముందు నన్ను ఎవరో తెలియదని అంటుందా? అసలు దానికి ఎంత పొగరు కట్టుకున్న మొగుణ్ణి అని ఎందుకు చెప్పలేకపోయింది అని ధీరజ్ అనగానే తిరుపతి ఓ ఇదంతా మా అమ్మాయి కోసం వచ్చిందని అంటారు..

ప్రేమ మాటతో దిమ్మతిరిగే షాక్..

ప్రేమ వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు అని చూస్తూ ఉంటుంది.. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ప్రేమ వీళ్లిద్దరూ నావల్ల గొడవ పడుతున్నారు అని కిందకు దిగివస్తుంది.. ఆ మాట వినగానే ధీరజ్ ప్రేమను చూసి నన్ను ఎందుకు నువ్వు చెప్పలేకపోయావు.. నేనంటే నీకు ఎందుకు అంత కోపం అని అడుగుతాడు.. కానీ ప్రేమ నువ్వు చెప్పచ్చు కదా తను నా భార్య అని నేను ఎందుకు చెప్పాలి అని ఇద్దరు కాసేపు గొడవపడతారు.. ప్రేమ ధీరజ్ ఇద్దరు గొడవ పడడం కాసేపు ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ఈ ఎపిసోడ్ కి వీళ్ళిద్దరూ గొడవ బాగా ఉండడంతో జనాలు కూడా ఎంజాయ్ చేసేలా కనిపిస్తుంది..

నర్మద మాస్టర్ ప్లాన్..

నర్మదా అసలు ఈ గొడవలకి కారణం ఎవరు వల్లి ఎక్కడ లేదా ఇంకెవరైనా ఉన్నారా అంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఒక బోర్డు మీద వాళ్ల పేర్లు అన్ని రాసుకొని పెద్ద ప్లాన్ చేస్తూ కనిపిస్తది అది చూసిన సాగర్ ఏంటే ఇంత ప్రణాళికలు ఇస్తున్నావు అసలు ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. అసలు పుట్టినరోజు ఎందుకు ఇప్పుడు పుట్టినరోజుని చేయించాలి అని అనుకుంది. ఏదో ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగు పెట్టారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ఆ తర్వాత నువ్వు నీ ప్లాన్లు ఆపేసి పడుకుంటే మంచిది అని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం నాకు అనుమానం ఇంకాస్త ఎక్కువగా ఉంది అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live