Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

Big TV Live 1 week ago

Washing machine with heater: ప్రస్తుత కాలంలో కేవలం బట్టలు ఉతకడమే కాకుండా.. వాటిపై ఉండే బ్యాక్టీరియా, మొండి మచ్చలను పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం.

దీని కోసం మార్కెట్లో ఇన్-బిల్ట్ హీటర్ టెక్నాలజీతో కూడిన వాషింగ్ మెషీన్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వేడి నీటితో ఉతకడం వల్ల బట్టలు సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు హైజెనిక్‌గా ఉంటాయి. మీ బడ్జెట్ , అవసరాలకు సరి పోయేలా మార్కెట్లో డిమాండ్ ఉన్న 5 బ్రాండెడ్ హీటర్ వాషింగ్ మెషీన్ల ఫీచర్లు, ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 వాషింగ్ మెషీన్స్ విత్ హీటర్:

1.LG 8 Kg AI Direct Drive Front Load:

ఈ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్-బిల్ట్ హీటర్, స్ట్రీమ్ వాష్ ద్వారా బట్టలపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.37,990 వరకు ఉంది.

2.Samsung 9 Kg Wi-Fi Inverter Front Load:

ఏఐ ఎకోబబుల్ టెక్నాలజీ కలిగిన ఈ ఫ్రంట్ లోడ్ మెషీన్, తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా అద్భుతమైన క్లీనింగ్ ఇస్తుంది. హైజీన్ స్ట్రీమ్ హీటర్ ఆప్షన్ ఉన్న ఈ మెషిన్ ధర సుమారు రూ. 34,990 నుంచి ప్రారంభమవుతుంది.

3. IFB 7 Kg 5 Star AI Powered Front Load:

చిన్న కుటుంబాలకు ఇది చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆక్వా ఎనర్జీ , ఇన్-బిల్ట్ హీటర్ ఉండటం వల్ల హార్డ్ వాటర్‌లో బట్టల మురికి పూర్తిగా తొలగిపోతుంది . దీని ధర సుమారు రూ.30,291గా ఉంది.

4. LG 8 Kg Smart Inverter Top Load:

టాప్ లోడ్ ఇష్టపడే వారి కోసం ఇన్-బిల్ట్ హీటర్‌తో వస్తున్న అద్భుతమైన మోడల్ ఇది. 6 మోషన్ వాష్ టెక్నాలజీ , వై-ఫై సపోర్ట్ దీని ప్రత్యేకత. మార్కెట్లో దీని ధర సుమారు రూ.26,490 వరకు ఉంటుంది.

5. Bosch 7 Kg Fully Automatic Top Load:

జర్మన్ టెక్నాలజీతో తయారైన.. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఇన్-బిల్ట్ హీటర్, పవర్ ఫుల్ పల్సేటర్ కలిగి ఉంటుంది. బట్టల మురికిని పోగొట్టడంతో ముందుండే ఈ మెషిన్ ధర సుమారు రూ.18,890 గా ఉంది.

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

హీటర్ వాషింగ్ మెషీన్ల వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇన్-బిల్ట్ హీటర్ టెక్నాలజీతో..పనిచేసే వాషింగ్ మెషీన్లను ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వేడి నీటితో ఉతకడం వల్ల బట్టలపై ఉండే 99.9% బ్యాక్టీరియా, వైరస్లు, క్రిములు పూర్తిగా నశిస్తాయి. ఇది పిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారికి ఎంతగానో ఆరోగ్యకరమైనది.

సాధారణ నీటితో పోలిస్తే.. వేడి నీరు బట్టలపై పేరుకుపోయిన మొండి మరకలు, నూనె జిడ్డు, చెమట వాసనను ఇట్టే తొలగిస్తుంది. అలాగే..చలి కాలంలో లేదా వర్షాకాలంలో బట్టలు త్వరగా.. ఆరేందుకు కూడా ఈ హీటర్ వాషింగ్ మెషీన్లు ఎంతగానో సహాయ పడతాయి.బట్టలు పాడవకుండా, పర్ఫెక్ట్ హైజీనిక్ క్లీనింగ్ ఇవి అందిస్తాయి.

గమనిక:

వాషింగ్ మెషీన్ కొనే ముందు మీ కుటుంబ సభ్యుల సంఖ్య , వాషింగ్ అవసరాలను బట్టి తగిన కెపాసిటీని ఎంచుకోవడం మంచిది. ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆఫర్లను బట్టి ధరలలో మార్పులు ఉండొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live