Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!

Big TV Live 5 days ago

Disadvantages of induction stovetop: వంటగదిలో గ్యాస్ బండలకు స్వస్తి చెప్పి, ఇండక్షన్ స్టవ్‌ వైపు అడుగులు వేస్తున్నారా? క్షణాల్లో వంట అయిపోతుందనే ఆత్రుతతో కొత్త టెక్నాలజీని తెచ్చి ఇంట్లో పెట్టుకునే ముందు ఈ చేదు నిజాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

పైపైన చూడటానికి చాలా హైటెక్‌గా కనిపించే ఈ ఇండక్షన్ల వెనుక మీ బడ్జెట్‌ను గుల్ల చేసే షాకింగ్ విషయాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని పాత్రలు పనిచేయవు :

ఇంట్లో పాత గిన్నెలు ఉన్నాయి కదా అని ఇండక్షన్ తెస్తే.. మొదటికే మోసం వస్తుంది. ఇండక్షన్ స్టవ్‌ల అతి పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే.. ఇది అన్ని రకాల గిన్నెలను అస్సలు దీనిపై పనిచేయవు. కేవలం మాగ్నెటిక్ (అయస్కాంత గుణం ఉన్న) పాత్రలను మాత్రమే.. ఇది వేడి చేస్తుంది. మీరు.. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న గాజు, రాగి, అల్యూమినియం, కొన్ని రకాల స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు దీనిపై అసలు పని చేయవు. దీంతో వంట పాత్రల కోసం మళ్లీ వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తుంది.

వంట చేయడం సాహసమే:

గ్యాస్ స్టవ్‌ మీద అలవాటు పడిన వారికి ఇండక్షన్‌పై వంట చేయడం ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ కంటికి కనిపించే మంట ఉండదు. అసలు స్టవ్ ఆన్ లో.. ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ నిరంతరం వెంటాడుతుంది. ఇది క్షణాల వ్యవధిలో వేడెక్కుతుంది కాబట్టి, కొంచెం పక్కకు వెళ్లినా కూరలు క్షణాల్లో మాడిపోయి బొగ్గు అయిపోతాయి. ఇక తడి చేతులతో టచ్ ప్యానెల్ అస్సలు స్పందించదు. వంట చేసేటప్పుడు గిన్నెలు జారి పోవడం వంటి చిరాకు తెప్పించే సమస్యలు సర్వసాధారణం.

చెవులను హోరెత్తించే శబ్దాలు:

వంట గదిలో ప్రశాంతంగా వంట చేసుకుందామంటే ఈ ఇండక్షన్ స్టవ్‌లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇవి ఆన్ చేసినప్పుడు వింతైన హమ్మింగ్, బజ్జింగ్ శబ్దాలను పుట్టిస్తాయి. ముఖ్యంగా హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు లేదా కొన్ని రకాల గిన్నెలను పెట్టినప్పుడు ఈ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. వంట అయిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లోపల ఫ్యాన్ తిరిగే శబ్దాలు వస్తూనే ఉంటాయి. ప్రశాంతంగా ఉండాల్సిన కిచెన్ కాస్తా ఏదో ఫ్యాక్టరీలా మారిపోయిన ఫీల్ కలుగుతుంది.

బయటి శబ్దాలకు చెక్ పెట్టే ఏఎన్‌సీ.. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యానికి ముప్పు:

ఇండక్షన్ స్టవ్ విడుదల చేసే.. పవర్‌ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టు పక్కల ఉండే డిజిటల్ పరికరాలను దెబ్బతీస్తుంది. స్టవ్ దగ్గర డిజిటల్ థర్మామీటర్లను వాడితే తప్పుడు రీడింగ్‌లు చూపిస్తాయి. అంతేకాదు.. చెవులకు హెడ్‌ ఫోన్లు పెట్టుకుని వంట చేస్తుంటే.. విపరీతమైన స్టాటిక్ నాయిస్, డిస్టర్బెన్స్ వస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ పేస్‌మేకర్ వాడేవారైతే ఇండక్షన్ స్టవ్‌లకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊహించని ఇన్‌స్టాలేషన్ ఖర్చులు:

మార్కెట్లో ఏదో ఒక సాధారణ ధరలో ఇండక్షన్ వస్తుంది కదా అని కొంటే.. పొరబడినట్టే. దీని అసలు ఖర్చు ఇప్పుడే మొదలవుతుంది. మీ ఇంటిలోని సాధారణ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇండక్షన్ పవర్‌ను తట్టుకోలేదు. దీంతో ప్రత్యేకంగా వైరింగ్ మార్పించాలి. కిచెన్ కౌంటర్‌ టాప్‌ను కట్ చేయించి రీ-మోడలింగ్ చేయించాలి. ఇవన్నీ కలిపితే..మీకు ఖర్చు పెరగడం ఖాయం. ఇన్ని రిస్క్‌లు భరించి ఇండక్షన్ తెచ్చుకోవడం కంటే.. అన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live