Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంత తక్కువ ధరకే అలాంటి ఫీచర్లా? 144Hz OLED డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో Asus Pad T3201!

ఇంత తక్కువ ధరకే అలాంటి ఫీచర్లా? 144Hz OLED డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో Asus Pad T3201!

Big TV Live 1 week ago

Asus Pad T3201: ప్రీమియం ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ప్రియుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం అసుస్ ఒక సూపర్ న్యూస్ చెప్పింది. తమ సరికొత్త 'అసుస్ ప్యాడ్ T3201' ధరలను భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రకటించింది.

గేమింగ్, చదువు, క్రియేటివ్ పనులతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ డివైజ్‌ను డిజైన్ చేశారు. ఈ నెల 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, అసుస్ ఈ-స్టోర్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో ఇది అమ్మకానికి రానుంది.

ఈ ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ధర రూ.45,990 కాగా, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.49,990కి లభిస్తుంది. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి కంపెనీ 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. నెలకు కేవలం రూ.3,833 నుంచి చెల్లించి దీనిని సొంతం చేసుకోవచ్చు.

Asus Pad T3201 ప్రధాన ఆకర్షణ దీనిలోని 12.2 ఇంచుల 2.8K డ్యూయల్ లేయర్ ఓలెడ్ డిస్‌ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా ఉంటాయి. కళ్లకు అలసట కలగకుండా ప్రత్యేక సర్టిఫైడ్ టెక్నాలజీని ఇందులో వాడారు. కేవలం 6.5 మిమీ మందం, 523 గ్రాముల బరువుతో ఇది చాలా స్లిమ్‌గా, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. రాయడానికి, డ్రాయింగ్ వేయడానికి అసుస్ పెన్ 2.0 కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ Asus Pad T3201లో మీడియాటెక్ D8300 ఆక్టా కోర్ ప్రాసెసర్ వాడటం వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ చాలా వేగంగా పనిచేస్తాయి. మెమరీని SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. డాల్బీ అట్మాస్‌తో కూడిన నాలుగు స్పీకర్లు ఇచ్చారు కాబట్టి థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దీనిలో ఉన్న 9000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం అర గంటలోనే 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ట్యాబ్లెట్, ప్రీమియం విభాగంలో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live