Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Intinti Ramayanam Avani : రెండోసారి తల్లి కాబోతున్న అవని.. ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్..!

Intinti Ramayanam Avani : రెండోసారి తల్లి కాబోతున్న అవని.. ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్..!

Big TV Live 1 week ago

Intinti Ramayanam Avani : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇంటింటి రామాయణం అవని.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు..

ఈ సీరియల్లో అవని పాత్ర జనాలకి విపరీతంగా నచ్చేసింది.. తన కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే అవని ఏం చేస్తుంది అన్నది హైలెట్ గా ఉంటుంది. దాంతో ఇంటింటి రామాయణం సీరియల్ మొత్తానికి అవని క్యారెక్టర్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పాత్రలో బుల్లితెర నటి పల్లవి రామిశెట్టి నటిస్తుంది. తెలుగు చానల్స్ లో ఎన్నో సీరియల్స్లలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా పల్లవి రామిశెట్టి త్వరలోనే సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అసలు ఎందుకు అవని సీరియల్ నుంచి తప్పుకుంటుంది? అవని క్యారెక్టర్ ని జనాలు మిస్ అవ్వరా? నిజంగానే అవని క్యారెక్టర్ ఇకమీదట కనిపించదా అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అసలేం జరిగిందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రెండోసారి తల్లికాబోతున్న అవని..

అవని అలియాస్ పల్లవి రామిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో సీరియల్స్లలో నటించి తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకోవడంతో ఈమె ఏ సీరియల్ లో కనిపిస్తే ఆ సీరియలు సూపర్ హిట్ అవుతుంది.. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తున్న అవని త్వరలోనే సీరియల్కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.. ఎందుకంటే ఆమె రెండవ సారి ప్రెగ్నెంట్ కాబోతుందని సమాచారం. అందుకే పల్లవి సీరియల్ కి గ్యాప్ తీసుకోనుందని టాక్.. మరి ఈ సీరియల్ కి మెయిన్ బ్యాక్ గ్రౌండ్ గా ఉన్న అవని క్యారెక్టర్ని జనాలు బాగా మిస్ అవుతారు.. అవని ప్లేస్ లో మరొక నటి ఎంట్రీ ఇస్తుందేమో అన్నది సస్పెన్స్ గా మారింది..

Also Read :Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన చక్రీ.. మహాకు నిద్రపట్టదు..

పల్లవి రామిశెట్టి రియల్ లైఫ్..

తెలుగు బుల్లితెర నటి పల్లవి రామిశెట్టి రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమె పదో తరగతి చదువుతున్నప్పుడే ఆమెకు సీరియల్స్ ఆడిషన్స్ వచ్చాయట.. ఈటీవీ లో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి యాంకర్ గా సెలెక్ట్ అయ్యింది. అలా టీవీ రంగంలోకి ప్రవేశించింది.. భార్యామణి, ఆడదే ఆధారం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లలో నటించింది. 2019లో ఈమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.. పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం దాల్చడంతో కొన్నేళ్లు సీరియల్స్ కి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు బులితెరపై రీఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈమెకు ఆల్రెడీ ఒక బాబు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానివల్లే సీరియల్స్ కి గ్యాప్ తీసుకోనుందని టాక్.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే పల్లవి రామిశెట్టి రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాలి…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live