Dailyhunt
Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయా రచ్చ.. ప్రణతి కోసం వెళ్లిన భరత్.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయా రచ్చ.. ప్రణతి కోసం వెళ్లిన భరత్.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Big TV Live 5 days ago

Intinti Ramayanam Today Episode May 5th : పల్లవి చెప్పిన విషయాన్ని భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. భర్త అవసరం లేదని వెళ్ళిపోయింది. తనకోసం నేను ఇంత చేసిన సరే తను మాత్రం నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది అంటూ భరత్ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

మీనాక్షి చక్రధర్లు ప్రణతిని ఇంటికి తీసుకురమ్మని ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం ఎవడి మాట వినడు. నాకు చెప్పడానికి మీరెవరు అన్నట్లుగా చక్రధర్ కు సమాధానం చెప్తాడు.

శ్రీయ మాటతో షాక్..

శ్రియకి నొప్పి తగ్గిందో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు శ్రీకర్. కాసేపటి తర్వాత శ్రేయ లేవడంతో చాలా సంతోషంగా ఉంటాడు.. ఇప్పుడు నీకు ఎలా ఉంది శ్రియ నీకు ఏమైనా అయిందా అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని శ్రీకర్ అంటాడు. కాసేపు పడుకుని లేచాను కదా ఎటువంటి నొప్పి లేదు అని చెప్తుంది.. నాకు బాగా ఆకలేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది అని శ్రియ అంటుంది. ఇప్పుడు కడుపుతో ఉన్నావ్ కాబట్టి బయట ఆర్డర్లు పెట్టుకొని తినడం మంచిది కాదు. ఇందాకే నొప్పితో ఎంతగా బాధపడ్డావో చూసాం కదా అని శ్రీకర్ అంటాడు.. నీకోసం నేను ఏదైనా చేసుకొని వస్తాను అని వంటగదిలోకి వెళ్లిన శ్రీకర్ దోశ వేసుకొని తీసుకొస్తాడు.. అది చాలా చండాలంగా ఉంది అని శ్రియ అనగానే అయితే నీకోసం ఇంకేదైనా తీసుకొస్తాను అని ఫ్రూట్స్ తీసుకొచ్చి చేతికిస్తాడు. నువ్వు ఇప్పుడు మన ఇంట్లో ఉంటే వదినమ్మ నీకు ఏ లోటు రాకుండా చూసుకునే వాళ్ళు అని అనగానే శ్రేయ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది..

ఆస్తి కోసం మళ్ళీ శ్రీయ రచ్చ..

ప్రతిసారి నిన్ను నీతోనే ఉండాలి అంటే కష్టంగా ఉంది. డబ్బులు కావాలి అంటే నేను బయటికి వెళ్లి పని చేయాలి కదా.. అలాకాకుండా నీతోనే ఉంటే ఇక ఏం పని చేయాలి అని శ్రీకర్ సీరియస్ అవుతాడు. అసలు నువ్వు పని చేయాల్సిన అవసరం ఏంటి. నీకు రావలసిన ఆస్తిని మీ అన్నయ్య దగ్గరికి వెళ్లి అడుగు వాళ్ళు ఇస్తారు కదా అని శ్రీకర్తో రాష్ గా మాట్లాడుతుంది శ్రియ.. మా అన్నయ్య డబ్బులు ఇవ్వలేక కాదు మా నాన్న రాసిన ఆస్తి అఫీషియల్ గా రిజిస్టర్ అవ్వలేదు. ఆయన సంతకం లేకుండా ఏది జరగదు కదా అనే శ్రీకర్ అనగానే.. నువ్వు ఒక లాయర్ వి ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని శ్రియ ఆస్తి కోసం మరోసారి రచ్చ చేస్తుంది..

ప్రణతి కోసం వెళ్లిన భరత్..

చక్రధర్ మీనాక్షి ప్రణతిని తీసుకురమ్మని ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం నాకు చెప్పడానికి వీల్లేదు తను ఇష్టమైతే వస్తుంది లేదంటే అక్కడే ఉంటుంది అని అంటాడు. అవని ఫోన్ చేసి చెప్పినా కూడా భరత్ మాత్రం వినకపోవడంతో అవని బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఉదయం భరత్ ఇంటికి రావడం చూసినా అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో గొడవలు రావడం కామనే కానీ ఇలా రావడం మంచిది కాదు అని ప్రనితికి హితబోధ చేసి మరి తన పుట్టింటి వాళ్ళు భరత్ తో పంపిస్తారు. ప్రణతి అత్తింటికి వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటారు మీనాక్షి చక్రధర్ లు..

అవనికి మైండ్ బ్లాక్..

ప్రణతిని అందరూ కలిసి భర్త పంపించేందుకు ఒప్పించి బయటికి తీసుకుని వస్తారు.. అయితే అవనిని ఏమండీ అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పుడూ అక్క అని పిలిచెను ఇప్పుడు ఏవండీ అని పిలుస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మీరు మీ పనులు చేసుకుంటే మేము మా పనులు చేసుకుంటాం దయచేసి మా పనుల్లో మీరు తల దూర్చకండి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి భరత్ వెళ్తాడు. పల్లవికి మాత్రం వెళ్తాను సిస్టర్ అని మర్యాదగా చెప్పడంతో అవని షాక్ అవుతుంది.. నన్నేమో ఏవండి అని పిలుస్తున్నాడు పల్లవి నేమో అక్కా అని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనాక్షి చక్రధర్లు ఇద్దరు కూడా ప్రణతి వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : 'లక్ష్మీ రావే మా ఇంటికి ' సింధు రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live