Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Intinti Ramayanam Today Episode: ఫస్ట్ టైమ్ బాబును ఎత్తుకున్న పల్లవి.. అవని పూజ.. అడ్డంగా దొరికిన మగాళ్లు.

Intinti Ramayanam Today Episode: ఫస్ట్ టైమ్ బాబును ఎత్తుకున్న పల్లవి.. అవని పూజ.. అడ్డంగా దొరికిన మగాళ్లు.

Big TV Live 1 week ago

Intinti Ramayanam Today Episode august 6th : పల్లవి తన బాబుని కాపాడింది అని శ్రియ తనపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాగే ఇంట్లోని వాళ్ళందరూ కూడా నువ్వు రిస్క్ చేసి బాబుని కాపాడవు చాలా గ్రేట్ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపిస్తారు.

తను చాలా మారిపోయింది అని కమల్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు.. అందరూ కలిసి సంతోషంగా ఉన్న సమయంలో కమల్ పల్లవికి ప్రపోజ్ చేసి మనసులోని ప్రేమను బయటపెడతాడు.. పల్లవి ఇంతగా మారిపోతుందని అసలు ఊహించలేదు పల్లవి నిజంగా గ్రేట్ అంటూ అందరూ కూడా పల్లవి పై పొగడ్తల వర్షం కురిపిస్తారు. అందరూ కూడా పల్లవి ఇంత మారిపోతుందని అసలు ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు.. కానీ అవని మాత్రం పల్లవి మారిపోయింది నా చెల్లెలు ఎంత మంచిదో అంటూ బాధపడిపోదు కన్నీళ్లు పెట్టుకుంటుంది. పల్లవిని ఓదారుస్తూ ఉంటాడు అక్షయ్.

మృత్యుంజయ్ హోమం…

పల్లవి పూర్తిగా మారిపోయింది దానికి కారణం నువ్వే అమ్మా అని దేవుడి దగ్గర దండం పెట్టుకొని అవని మా అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటుంది. లోపలికి వెళ్ళగానే పంతులుగారు ఒకరు కనిపించడంతో పార్వతి ఏంటి అవని పంతులు గారిని రమ్మని చెప్పారంట ఆయన వచ్చాడు అని చెప్పగానే. నేనే రమ్మన్నాను అత్తయ్య మొన్న బాబుకి పల్లవి కల జరిగింది కదా ఇలాంటి దోషాల వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అని ఆయన నేను రమ్మని చెప్పాను అని అవని అంటుంది. ఇక ఆయన పరిస్థితులను అర్థం చేసుకొని మృత్యుంజయ హోమం జరిపిస్తే బాగుంటుంది అని సలహా ఇస్తాడు. ఇక అవని ఆహ్ హోమం జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది కాబట్టి అదే చేద్దాం అత్తయ్య అని అడుగుతుంది. సరే అమ్మ నీ ఇష్టప్రకారమే చేయించు అని పార్వతీ పర్మిషన్ ఇస్తుంది..

ఫస్ట్ టైమ్ బాబును ఎత్తుకున్న పల్లవి..

ఇక పల్లవి అందరూ అక్కడ ఉండగా అక్కడికి వస్తుంది.. ఏంటమ్మా పల్లవి ఇప్పుడు నీకు నొప్పి తగ్గిందా ఎలా ఉంది ఇప్పుడు అని అందరూ అడుగుతారు. టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని భానుమతి అడగ్గానే నేను మర్చిపోయాను కానీ అవని అక్క గుర్తు చేసి మరి ఈ టాబ్లెట్స్ ఇచ్చింది అని చెప్తుంది.. నిన్ను కాపాడిన మీ పిన్ని ఇక్కడే ఉంది మీ పిన్ని దగ్గరికి వెళ్తావా అని అవని బాబుని తీసుకుని వచ్చి పల్లవి చేతికి ఇవ్వగానే నాకు పిల్లల్ని ఎత్తుకోవడం రాదు అక్క అని పల్లవి అంటుంది. కానీ పల్లవి మాట విన్న అవని ఎత్తుకుంటే కదా.. వస్తుందో రాదో తెలిసేది నువ్వు వెతుకు వాడు నీ దగ్గర ఎంత బాగుంటాడో చూడు అని అనగానే పల్లవి బాబుని తీసుకుని ఆడిస్తుంది ఇక తను కూడా పల్లవి ఒడిలోనే చాలా హ్యాపీగా ఉంటాడు.. ఏదో హోమం గురించి మాట్లాడుతున్నారు కదా ఏంటి ఆ హోమం మనీ శ్రీ అడుగుతుంది. పల్లవి అలాగే బాబుకి అలా జరిగింది కదా అందుకే మీ అవ్వని అక్క ఇలాంటి హోమం జరిపిస్తే మంచిది అని అనుకుంటుంది అని పార్వతి అంటుంది.

గుడ్ న్యూస్ చెప్పిన శ్రీకర్..

అందరూ కలిసి బాబుతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకర్ బాబు వచ్చిన వేలా విశేషం ఏం జరిగినా కూడా.. అన్ని మన మంచికే జరుగుతున్నాయి అని మరోసారి పొగిడిస్తూ ఉంటాడు.. బాబు వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మంచి పని దొరికింది. ఒక మంచి కార్పొరేట్ కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉండాలి. కేసులు ఉన్నా లేకపోయినా కూడా డబ్బులు ఇస్తారు నేను వెతుక్కోవాల్సిన పనిలేదు అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. శ్రీకరుడు అక్షయ్ ఇద్దరు కూడా బాగుపడిపోతున్నారు అని భానుమతి చాలా ఫీల్ అయిపోతుంది..

పల్లవిని రెచ్చగొట్టిన భానుమతి..

భానుమతిని పక్కకు తీసుకొని వెళ్ళిన పల్లవి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా ఇప్పుడు అని అడుగుతుంది.. అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడేంటి అని పల్లవి అడుగుతుంది ఏదో ఒక బిజినెస్ చేస్తూ మంచిగానే ఉన్నాడు అక్షయ్ అటు శ్రీకర్ కూడా ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది అని చెప్తున్నాడు. ఇక ఖాళీగా ఉన్నది మీ ఆయన మాత్రమే మీ ఆయన ఖాళీగా ఉంటూ అందరికీ క్యారేజీలు మోస్తూ ఆరాధ్య స్కూల్ కి ఇంటికి తిప్పుతూ ఉంటాడా? ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్పొచ్చు కదా అని చెప్పగానే అమ్మమ్మ ఇప్పుడు మేము చాలా గొప్పగా ఉన్నాం సంతోషంగా ఉన్నాను. నువ్వు మధ్యలో ఇలాంటివి ఏమీ పెట్టద్దు అని అంటుంది.. ఒకప్పుడు నేను డబ్బు బంగారం అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మా ఆయన అన్ని చేస్తున్నాడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటాను అని పల్లవి అంటుంది ఆ మాట విన్న అవని బాధ పడిపోతుంది.

అడ్డంగా బుక్కయిన బ్రదర్స్..

ఇక అవని అక్షయ్ దగ్గరికి వెళ్లి కమల్ ఖాళీగా ఉన్నాడు కదా తనకి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు సక్సెస్ అయ్యాం కదా ఆఫీస్ పెడుతున్నప్పుడు వాడిని మేనేజ్ ని చేస్తాను అని అవని తో అక్షయ్ అంటాడు ఆ మాట వినగానే చాలా సంతోషంగా ఉంటుంది అవని. ఇక రాత్రి అందరు పడుకునే తర్వాత ముగ్గురు అన్నదమ్ములు పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. అంత ఏర్పాటు చేసుకున్న తర్వాత అవని స్టఫ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంది.అందరూ అడ్డంగా దొరికిపోయామని అనుకుంటారు. కానీ ఆడవాళ్లు మా పార్టీ మాకు ఉంటుంది కదా అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live